Films In Telangana: ఫిలిమ్స్‌ ఇన్‌ తెలంగాణ.. చిత్ర పరిశ్రమ కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌: దిల్ రాజు

చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సింగిల్ విండో ద్వారా(Films In Telangana) ఒక సినిమాకు సంబందించిన అన్ని అనుమతులను పొందేలా ఫిలిమ్స్‌ ఇన్‌ తెలంగాణ పేరుతొ ఒక ప్రత్యేకమైన వెబ్‌సైట్‌ ను రూపొందించనున్నారు.

Films In Telangana: ఫిలిమ్స్‌ ఇన్‌ తెలంగాణ.. చిత్ర పరిశ్రమ కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌: దిల్ రాజు

A special website named Film in Telangana for the development of the film industry

Updated On : September 16, 2025 / 10:10 AM IST

Films In Telangana: చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సింగిల్ విండో ద్వారా ఒక సినిమాకు సంబందించిన అన్ని అనుమతులను పొందేలా ఫిలిమ్స్‌ ఇన్‌ తెలంగాణ పేరుతొ ఒక ప్రత్యేకమైన వెబ్‌సైట్‌ ను రూపొందించనున్నారు. (Films In Telangana)దీనికి సంబంధించి ప్రత్యేక వర్క్ షాప్ జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌రాజు, ఎఫ్‌డీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సి.హెచ్‌.ప్రియాంక, టూరిజం కార్పొరేషన్‌ ఎండీ క్రాంతి పాల్గొన్నారు.

Bigg Boss 9 Telugu: బాగ్ బాస్ లో నామినేషన్స్ రచ్చ.. కన్ఫెషన్ రూమ్ కి మాస్క్ మ్యాన్.. సింపతీ గేమ్ మొదలుపెట్టాడా?

ఈ సందర్భంగా ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌రాజు మాట్లాడుతూ.. తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఎంతో సానుకూలంగా ఉన్నారు. సినీ నిర్మాతలు కేవలం స్క్రిప్ట్‌తో వస్తే చాలు.. వారి సినిమాకు అవసరమైన షూటింగ్‌ లొకేషన్లు, అనుమతులు అన్నింటినీ ఈ సింగిల్‌ విండో ద్వారా పొందవచ్చు. థియేటర్ల నిర్వహణ కోసం అవసరమయ్యే బీ-ఫామ్‌ను కూడా చాలా సులువుగా ఆన్‌లైన్‌ ద్వారా పొందవచ్చు. సినిమా నిర్మాణాన్ని మరింత సులభతరం చేయడానికి ఈ కొత్త విధానాన్ని ప్రవేశ పెడుతున్నట్లు ఆయన తెలిపారు.

అలాగే, థియేటర్ల నిర్వహణలో ఇప్పటి వరకు ఉన్న పద్ధతుల్లో కొన్ని మార్పులు చేస్తున్నట్లు కూడా తెలిపారు. అలాగే, ఈ వెబ్‌సైట్‌ రూపకల్పన కోసం చిత్ర పరిశ్రమ ప్రతినిధుల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటామని, వెబ్‌సైట్‌ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాక సీఎం రేవంత్‌ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిల చేతుల మీదుగా ప్రారంభిస్తామని దిల్‌ రాజు పేర్కొన్నారు.