ప్రభాస్ ఫ్యాన్స్ కు రాధాకృష్ణ ప్రామిస్, త్వరలోనే టీజర్

ప్రభాస్ ఫ్యాన్స్ కు రాధాకృష్ణ ప్రామిస్, త్వరలోనే టీజర్

Updated On : January 6, 2021 / 1:31 PM IST

Radhe Shyam Teaser : టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కు ప్రామీస్ చేశారు దర్శకుడు రాధాకృష్ణ. ఈయన దర్శకత్వంలో.. ‘రాధే శ్యామ్’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ పోస్టర్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రేక్షకుల నుంచి భారీ స్పందనే రావడంతో..సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే..టీజర్ ఎప్పుడొస్తుందా ? అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో…దర్శకుడు రాధాకృష్ణ ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేశారు.

టీజర్ అప్ డేట్ త్వరలోనే మీ ముందుకు వస్తుందని, అంతవరకు ఓపిక పట్టాలని ఫ్యాన్స్ కు సూచించారాయన. ఓపికకు తగ్గ ప్రతిఫలం దక్కుతుందని, నేను మీకు హామీనిస్తున్నా..మీ మొహంలో చిరునవ్వులు చిందిస్తుందని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఇటలీ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. సినిమాకు సంబంధించిన విషయాలను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో పంచుకొంటోంది. అత్యధిక భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. పీరియాడికల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జస్టిస్ ప్రభాకరన్ సంగీతాన్ని అందిస్తున్నారు. మరి టీజర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి.