mirai
Teja Sajja : హనుమాన్ సినిమాతో ఒక్కసారిగా స్టార్ డమ్ తెచ్చుకున్న తేజ సజ్జా ఇప్పుడు మిరాయ్ సినిమాతో రాబోతున్నాడు. సెప్టెంబర్ 12న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజయిన గ్లింప్స్, ట్రైలర్స్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మంచు మనోజ్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తుండటంతో మరింత హైప్ నెలకొంది.(Teja Sajja)
తాజాగా మిరాయ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్లో తేజ సజ్జా మాట్లాడిన మాటలు టాలీవుడ్ లో చర్చగా మారాయి.
Also Read : Pawan Kalyan : పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించకూడదు అంట.. హైకోర్టులో పిటిషన్..
మిరాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో తేజ సజ్జ మాట్లాడుతూ.. ఈ సినిమా చాలా తక్కువ ధరలకే థియేటర్స్ లో చూడబోతున్నారు అన్ని ఏరియాలలో. ఎలాంటి టికెట్ ధర ఈ సినిమాకు పెంచడం లేదు. దానికి ఎంకరేజ్ ఇచ్చి మీరు సినిమా చూసి మా నిర్మాతలకు మీరు ప్రూవ్ చేయాలి. నేను విశ్వా గారిని, డిస్ట్రిబ్యూటర్స్ ని ఇబ్బంది పెట్టి ఈ నిర్ణయం తీసుకున్నాను. మీరు తక్కువ ధరలకే మిరాయ్ సినిమా చూడబోతున్నారు. ఫ్యామిలీ అంతా వెళ్లి ఒక మంచి సినిమా చూడాలనే నా తాపత్రయం, అందుకే టికెట్ రేట్లు పెంచట్లేదు అని తెలిపాడు.
ఇటీవల సినిమా థియేటర్స్ కి జనాలు రావట్లేదు, సినిమాలు చూడట్లేదు, పెద్ద సినిమాలకు కూడా రావట్లేదని టాలీవుడ్ లో అందరూ అంటున్నారు. అందుకు రకరకాల కారణాలు ఉన్నా టికెట్ రేట్ల పెంపు కూడా ముఖ్య కారణం. సినిమా టికెట్ రేట్లను ఇష్టమొచ్చినట్టు పెంచేసి ఫ్యామిలీలను సినిమాలకు రాకుండా నిర్మాతలే చేస్తున్నారు. ఇది వాస్తవం అని నిర్మాతలే కొన్ని సందర్భాలలో చెప్పారు. కానీ పెరిగిన బడ్జెట్ రప్పించాలని టికెట్ రేట్లు పెంచుతున్నారు.
Also See : Allu Arjun : అల్లు అర్జున్ నానమ్మ దశదిన కర్మ.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు.. ఫొటోలు..
ఇటీవల టికెట్ రేట్లు తక్కువ ఉన్న సినిమాలు బాగా ఆడటంతో మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఒకవేళ సినిమా బాగున్నా టికెట్ రేట్లు ఎక్కువ ఉంటే జనాలు రావట్లేదు. ఇప్పుడు తేజ సజ్జా పబ్లిక్ ఈవెంట్లో తక్కువ టికెట్ రేట్లు పెట్టాము మీరు సినిమా చూస్తే మా నిర్మాతలు మారాలి అనడంతో టికెట్ రేట్లు పెంచే నిర్మాతలకు డైరెక్ట్ గానే కౌంటర్ ఇచ్చాడని అంటున్నారు. మరి టాలీవుడ్ నిర్మాతలు ఇప్పటికైనా టికెట్ రేట్లు పెంచకుండా ఉంటారా చూడాలి. మిరాయ్ టికెట్ రేట్లు అయితే సింగిల్ స్క్రీన్స్, మల్టిప్లెక్స్ లలో 200 లోపే ఉండనుంది.