Teja Sajja Hanuman Movie Record Collections in America
Hanuman Collections : యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ(Prashanth Varma) దర్శకత్వంలో తేజ సజ్జ(Teja Sajja) హీరోగా మన పురాణాల్లోని హనుమంతుడిని ఆధారంగా తీసుకొని ఓ సూపర్ హీరో కథగా తెరకెక్కిన సినిమా హనుమాన్. వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రఖని, అమృత అయ్యర్, గెటప్ శీను, వెన్నెల కిషోర్, సత్య, వినయ్ రాయ్.. పలువురు ముఖ్య పాత్రలు చేశారు. ముందు నుంచి ఈ సినిమాపై అంచనాలు ఉండగా సినిమా రిలీజయి పాజిటివ్ టాక్ రావడంతో భారీ విజయం సాధించింది.
హనుమాన్ సినిమా సౌత్ తో పాటు నార్త్ లో కూడా అదరగొడుతుంది. ఆల్రెడీ పండగ మూడు రోజులు బుకింగ్స్ కూడా అయిపోయాయి. రిలీజ్ కి ముందు రోజు దాదాపు 1000 షోలు ప్రీమియర్స్ వేయగా దాని నుంచి కూడా భారీ కలెక్షన్స్ వచ్చాయి. అన్ని చోట్ల భారీ విజయం సాధించిన హనుమాన్ కలెక్షన్స్ కూడా భారీగా తెచ్చుకుంటుంది. ఇక అమెరికాలో కూడా హనుమాన్ హవా సాగుతుంది.
ఇండియన్ సినిమాలకు, తెలుగు సినిమాలకు అమెరికాలో మంచి మార్కెట్ ఉంది. అమెరికాలో కూడా మన సినిమాలు గ్రాండ్ గా రిలీజయి మంచి కలెక్షన్స్ సాధిస్తాయి. మన హీరోలు అక్కడ కూడా కలెక్షన్స్ లో రికార్డులు సెట్ చేస్తారు. అమెరికాలో 1 మిలియన్ డాలర్స్ అంటే మన రూపాయల్లో దాదాపు 8 కోట్లు కలెక్ట్ చేస్తే మంచి కలెక్షన్స్ వచ్చినట్టే. మన హీరోలంతా అమెరికాలో 1 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసి రికార్డులు సెట్ చేయాలని ఆశపడతారు. ఈ విషయంలో మహేష్ బాబు అందరికంటే ముందు ఉన్నాడు. ఇప్పుడు రిలీజయిన గుంటూరు కారం సినిమాతో మహేష్ 12 సార్లు ఈ 1 మిలియన్ డాలర్స్ ఫీట్ సాధించాడు.
Also Read : Hanuman : హనుమాన్ సినిమా వేయలేదని.. ఆ థియేటర్లను హెచ్చరించిన నిర్మాతల మండలి..
ఈ లిస్ట్ లో ఆల్రెడీ మన స్టార్స్ జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ప్రభాస్, చిరంజీవి, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ.. పలువురు ఇండగా ఇప్పుడు తేజ సజ్జ కూడా ఎంటర్ అయ్యాడు. హనుమాన్ సినిమా అమెరికాలో 1 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసింది. కేవలం రోజున్నరలోనే హనుమాన్ సినిమా అమెరికాలో ఈ రేంజ్ కలెక్షన్స్ సాధించింది. దీంతో చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా కలెక్షన్స్ పెరిగే అవకాశం కూడా ఉంది. 2 మిలియన్ డాలర్స్ వరకు వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదు.
?#HanuManRAMpage pic.twitter.com/QHfrO8wJaq
— Teja Sajja (@tejasajja123) January 13, 2024