Hanuman : హనుమాన్ సినిమా వేయలేదని.. ఆ థియేటర్లను హెచ్చరించిన నిర్మాతల మండలి..
డిస్ట్రిబ్యూటర్ల ఒప్పందంతో కొన్ని థియేటర్లు నైజాంలో హనుమాన్ సినిమా తీసుకున్నా హనుమాన్ రిలీజ్ చేయకపోవడంతో చిత్రయూనిట్, డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు.

Hanuman Movie Theaters Issue Telugu Film Producer Council Released Press Note
Hanuman : ఈ సంక్రాంతికి నాలుగు సినిమాల రిలీజ్ ఉండటంతో థియేటర్స్ ఇష్యూ వచ్చింది. దీంతో నిర్మాతలు అంతా కూర్చొని సినిమాలకు థియేటర్స్ అడ్జస్ట్ చేసుకున్నారు. అయితే హీరో స్టార్ డమ్, సినిమా డిమాండ్ ని బట్టి థియేటర్స్ ని అడ్జస్ట్ చేశారు. మొదటి రోజు నిన్న జనవరి 12న గుంటూరు కారం, హనుమాన్ సినిమాలు రిలీజ్ అవ్వగా డిమాండ్ తో ఆల్మోస్ట్ 90 శాతం థియేటర్లు గుంటూరు కారంకి వెళ్లాయి. మిగిలిన వాటిల్లో హనుమాన్ సినిమా రిలీజ్ అయింది.
రెండు సినిమాలు మంచి విజయం సాధించి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే డిస్ట్రిబ్యూటర్ల ఒప్పందంతో కొన్ని థియేటర్లు నైజాంలో హనుమాన్ సినిమా తీసుకున్నా హనుమాన్ రిలీజ్ చేయకుండా గుంటూరు కారం రిలీజ్ చేయడంతో హనుమాన్ చిత్రయూనిట్, డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిర్మాతల మండలి ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.
Also Read : Devil : కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ పండక్కి ఓటీటీలో.. ఎప్పుడు? ఎక్కడ?
ఈ ప్రెస్ నోట్ లో.. మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ LLP ‘హనుమాన్’ సినిమా 12-01-2024 నుండి ప్రదర్శన కొరకు తెలంగాణలో కొన్ని థియేటర్లతో అగ్రీమెంటు చేయడం జరిగింది. కానీ కొన్ని థియేటర్లు అగ్రిమెంట్ ను బేఖాతరు చేస్తూ ఈ సినిమా ప్రదర్శన చేయలేదు. ఈ విషయంపై మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాత నిరంజన్ రెడ్డి గారు ఫిర్యాదు చేయడం జరిగింది. థియేటర్లు అగ్రీమెంటు ప్రకారం ‘హనుమాన్’ సినిమా ప్రదర్శన చేయకపోవడం వలన డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు నష్టం జరిగింది కాబట్టి ఈ థియేటర్లు వెంటనే హనుమాన్ సినిమా ప్రదర్శన ప్రారంభించడంతో పాటు ఇప్పటి వరకు జరిగిన నష్టం భరించాలి. థియేటర్లు ఇటువంటి చర్యలు చేస్తే సినీ పరిశ్రమకు ప్రమాదం. ఈ చర్యని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి తీవ్రంగా ఖండిస్తుంది. ఇలాంటి అనైతిక చర్యలు నిరసిస్తూ తెలుగు సినీ పరిశ్రమ న్యాయానికి వ్యతిరేకంగా వ్యవహరించిన ఆ అథియేటర్లు హనుమాన్ సినిమాకి త్వరగా న్యాయం చేయాలని కోరుతుంది అని తెలిపారు. మరి దీనికి ఆ థియేటర్లు ఎలా స్పందిస్తాయో చూడాలి.