Devil : కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ పండక్కి ఓటీటీలో.. ఎప్పుడు? ఎక్కడ?
సంక్రాంతి పండక్కి థియేటర్స్ లో నాలుగు సినిమాలు సందడి చేస్తుంటే డెవిల్ కూడా పండక్కి ఓటీటీలో రానుంది.

Kalyan Ram Devil Movie OTT Releasing date and Streaming Platform Announced
Devil OTT Release : నందమూరి కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram) నటించిన పీరియాడిక్ స్పై యాక్షన్ థ్రిలర్ మూవీ ‘డెవిల్’ డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకి వచ్చి ప్రేక్షకులని మెప్పించింది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా, మాళవిక నాయర్ ముఖ్య పాత్రలో కనిపించారు ఈ సినిమాలో.
స్వతంత్రం ముందు సుభాష్ చంద్రబోస్, అతని అనుచరులని బ్రిటిష్ వాళ్ళు పట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు, మరో వైపు ఓ హత్య కేసు ఛేదించడం.. అనే కథాంశంతో డెవిల్ సినిమా ఆద్యంతం ఆసక్తిగా సాగింది. డెవిల్ సినిమా దాదాపు 30 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి మంచి విజయం సాధిచింది.
Also Read : Dil Raju : ఇక్కడ ఎవరికి ఎవరు శత్రువులు కారు.. సినిమా బాగుంటే చూస్తారు, ఆపలేరు..
ఇక డెవిల్ ఓటీటీ బాట పట్టింది. సంక్రాంతి పండక్కి థియేటర్స్ లో నాలుగు సినిమాలు సందడి చేస్తుంటే డెవిల్ కూడా పండక్కి ఓటీటీలో రానుంది. డెవిల్ సినిమా జనవరి 14 నుండి అమెజాన్ ప్రైమ్(Amazon Prime) ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఇంకెందుకు ఆలస్యం సంక్రాంతికి ఇంట్లో వాళ్ళతో కలిసి ఓటీటీలో డెవిల్ చూసేయండి..