Tejaswi Madivada : యాంకర్ సుమ కొడుకుని బ్రదర్ అంటూ ఆ హీరోయిన్ పోస్ట్.. వైరల్ అవుతున్న ఫొటో..
నటి తేజస్వి రోషన్ బర్త్ డే సందర్భంగా పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.

Tejaswi Madivada Wishes Suma son Roshan Kanakala Birthday post goes Viral
Tejaswi Madivada : యాంకర్ సుమ(Anchor Suma) కొడుకుగా రోషన్(Roshan) ఇటీవలే హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ‘బబుల్‌గమ్’ అంటూ మొదటి సినిమాతోనే బోల్డ్ కంటెంట్ తో వచ్చి ప్రేక్షకులని మెప్పించాడు. సినిమా ఆశించినంత విజయం సాధించకపోయినా రోషన్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే నిన్న మార్చ్ 15 రోషన్ పుట్టిన రోజు కావడంతో సుమ అభిమానులు, పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో రోషన్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఇక యాంకర్ సుమ కూడా తన కొడుకుకి స్పెషల్ గా విషెష్ తెలుపుతూ చిన్నప్పటి బర్త్ డే సెలబ్రేషన్ ఫొటో కూడా షేర్ చేసింది. ఇక నటి తేజస్వి రోషన్ బర్త్ డే సందర్భంగా పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, చిన్న సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ తేజస్వి మంచి పేరే తెచ్చుకుంది. ఇక సోషల్ మీడియాలో అయితే రెగ్యులర్ గా హాట్ ఫోటోలు షేర్ చేస్తూ వైరల్ అవుతుంది.
తాజాగా రోషన్ పుట్టిన రోజున ‘బ్రదర్ ఫ్రమ్ బెస్ట్ మదర్’ అంటూ రోషన్ ని ఉద్దేశించి హ్యాపీ బర్త్ డే చెప్తూ వీళ్ళిద్దరూ క్లోజ్ గా ఉన్న ఫోటో షేర్ చేసింది. రోషన్ ని బ్రదర్ అనడం తో పాటు, క్లోజ్ గా ఉన్న ఫోటో షేర్ చేయడంతో అసలు వీళ్ళిద్దరూ ఇంత క్లోజ్ ఎప్పుడు అయ్యారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడే హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ ని ఈ హీరోయిన్ బ్రదర్ అనడంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఇక దీనికి థ్యాంక్యూ తేజూ అంటూ రోషన్ కూడా కామెంట్ చేసాడు.