Bigg Boss 10: బిగ్ బాస్ సీజన్ 10లో స్టార్ కంటెస్టెంట్స్.. ఇద్దరికీ ఏకంగా కోటీ అరవై లక్షల రెమ్యునరేషన్.. ఎవరెవరు వస్తున్నారో తెలుసా?
త్వరలోనే గ్రాండ్ గా మొదలుకానున్న బిగ్ బాస్ తెలుగు 10(Bigg Boss 10)వ సీజన్.
Tejaswini Gowda and Kavyashree to enter Bigg Boss Telugu Season 10
- త్వరలోనే మొదలుకానున్న బిగ్ బాస్ సీజన్ 10
- ఈసారి కూడా స్టార్స్ కంటెస్టెంట్ల ఎంట్రీ
- తేజస్విని, కావ్య శ్రీల కోసం భారీ రెమ్యునరేషన్
Bigg Boss 10: తెలుగు ఆడియన్స్ బిగ్ బాస్ తెలుగు 10(Bigg Boss 10)వ సీజన్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ కొత్త సీజన్ అక్టోబర్ నెలలో ప్రారంభం కానుందని సమాచారం. ఈ నేపథ్యంలో, ఈసారి షో మేకర్స్ గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ బడ్జెట్తో కంటెస్టెంట్లను ఎంపిక చేస్తున్నారు. ముఖ్యంగా అమర్ దీప్ భార్య తేజస్విని గౌడ, నటి కావ్య శ్రీ ఈ సీజన్ లో ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నారని తెలుస్తోంది. అమర్ దీప్ భార్య తేజస్విని తనకున్న క్రేజ్ దృష్ట్యా వారానికి రూ.6 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె చేస్తున్న తమిళ సీరియల్ ను వదులుకుని రావాల్సి ఉండటంతో మేకర్స్ కూడా ఆ భారీ మొత్తానికి అంగీకరించారట.
Malavika Mohanan: స్టన్నింగ్ లుక్ లో మాళవిక మెరుపులు.. చూస్తే పిచ్చెక్కిపోవడం ఖాయం.. ఫొటోలు
ఇక, మరోవైపు బుల్లితెర నటి కావ్య శ్రీ కూడా దాదాపు రూ.5 లక్షల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ హౌస్ లో చివరి వరకు కొనసాగితే, కేవలం వీరి రెమ్యూనరేషన్ బడ్జెట్టే కోటి 60 లక్షల రూపాయల మార్కును దాటే అవకాశం ఉంది. గత సీజన్ మాదిరిగానే ఈసారి కూడా ‘అగ్నిపరీక్ష’ ద్వారా సామాన్యులకు చోటు కల్పిస్తూనే, సెలబ్రిటీల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా అత్యంత ప్రజాదరణ ఉన్న కంటెస్టెంట్లను హౌస్ లోకి తీసుకురావాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు.
ఓపక్క యూత్ ను అట్రాక్ట్ చేస్తూనే, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మిస్ అవకుండా ఉండేలా కంటెస్టెంట్లను సెలెక్ట్ చేస్తున్నారు మేకర్స్. అందుకే, మంచి ఫాలోయింగ్ ఉన్న ఈ ఇద్దరు హౌస్ లోకి రావడం వల్ల షో రేటింగ్స్ ఒక రేంజ్ లో రావడం ఖాయం అని మేకర్స్ భావిస్తున్నారు. అయితే కేవలం ఇద్దరికే ఇంత భారీ స్థాయిలో ఖర్చు చేస్తుండటంతో, మిగిలిన కంటెస్టెంట్లతో కలిపి మొత్తం సీజన్ బడ్జెట్ అంచనాలకు మించి ఉండబోతోంది. ఇక ఈ సీజన్ కి రానున్న మిగతా కంటెస్టెంట్ల వివరాలు కూడా త్వరలోనే బయటకు రానున్నాయి. మరి ఇప్పటివరకు 9 సీజన్స్ తో ఆడియన్స్ ను అలరించిన బిగ్ బాస్ 10 వ సీజన్ తో ఏమేరకు ఆకట్టుకుంటుంది అనేది చూడాలి.
