Raju Gaani Savaal : ‘రాజు గాని సవాల్’ టీజర్ రిలీజ్.. మరో తెలంగాణ సినిమా..

మీరు కూడా టీజర్ చూసేయండి..

Raju Gaani Savaal

Raju Gaani Savaal : లెలిజాల రవీందర్, రితికా చక్రవర్తి జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘రాజు గాని సవాల్’. లెలిజాల కమల ప్రజాపతి సమర్పణలో ఎల్ ఆర్ ప్రొడక్షన్ బ్యానర్ పై లెలిజాల రవీందర్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ని జగపతి బాబు చేతుల మీదుగా రిలీజ్ చేసారు. ఈ సినిమాని రక్షా బంధన్ పండుగ సందర్భంగా ఆగస్టు 8న శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు.

మీరు కూడా టీజర్ చూసేయండి..

 

Also Read : Samantha : రూమర్ బాయ్ ఫ్రెండ్ తో అమెరికాలో సమంత.. భుజంపై చెయ్యి వేసి.. రాజ్ – సమంత క్లోజ్ ఫోటో వైరల్..

టీజర్ లాంచ్ ప్రెస్ మీట్ లో నిర్మాత తరుణిక మాట్లాడుతూ.. ఈ సినిమా మాస్ ఎలిమెంట్స్ తో పాటు మనసుకు హత్తుకునే సెంటిమెంట్ తో ఉంటుంది. రాజు గాని సవాల్ సినిమా సక్సెస్ పై నమ్మకం ఉంది అని అన్నారు. హీరో, దర్శకుడు లెలిజాల రవీందర్ మాట్లాడుతూ.. మా మూవీ హైదరాబాద్ కల్చర్ ను చూపిస్తూ, తెలంగాణలో ఫ్యామిలీ బాండింగ్ ను రిఫ్లెక్ట్ చేసేలా ఉంటుంది. ఇక్కడ బ్రదర్ సిస్టర్ మధ్యలో బాండింగ్ ఎలా ఉంటుంది, కుటుంబంలోని బంధాలు ఎలా ఉంటాయి, స్నేహితుల మధ్య ఉన్న రిలేషన్ ఎలా ఉంటుందని చూపించాం. సహజంగా తెరకెక్కించేందుకు లోయర్ ట్యాంక్ బండ్ లోని కవాడిగూడలో రియల్ లొకేషన్స్ లో షూటింగ్ చేశాం. తెలంగాణ సంస్కృతి నేపథ్యంగా సాగే క్లాసిక్ మూవీ ఇది. ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి ఎమోషనల్ డ్రామా ఉంటుంది అని తెలిపారు.

Also Read : RK Sagar : వచ్చే తెలంగాణ ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ.. స్పందించిన ఆర్కే సాగర్..

నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు మాట్లాడుతూ.. జగపతి బాబు గారు ఎంతో బిజీగా ఉన్నా, మా మీద ప్రేమతో రాజు గాని సవాల్ టీజర్ లాంఛ్ చేశారు. బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ తో తెలంగాణ నేపథ్యంతో వస్తున్న సినిమా ఇది. టికెట్ కొనుక్కుని మా మూవీకి వచ్చే ఏ ప్రేక్షకుడిని మేము నిరాశపర్చము. మంచి లోకల్ ఎలిమెంట్స్, సెంటిమెంట్ తో ఆకట్టుకుంటుంది అని తెలిపారు.