Hari Hara VeeraMallu : హరిహర వీరమల్లుకు తెలంగాణలో కూడా టికెట్ రేట్లు పెంపు.. ఎంతంటే..?

తాజాగా తెలంగాణలో కూడా హరిహర వీరమల్లు సినిమాకు టికెట్ రేట్లు పెంచారు.

Hari Hara VeeraMallu

Hari Hara VeeraMallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా జులై 24న గ్రాండ్ గా పాన్ ఇండియా వైడ్ థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఇటీవల పెద్ద సినిమాలకు, భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ రేట్లు పెంచుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏపీలో టికెట్ రేట్లు పెంచారు.

ఏపీలో హరి హర వీరమల్లు సినిమాకు టికెట్ రేట్లు మొదటి రెండు వారాలకు పెంచాలని నిర్మాతలు కోరగా కేవలం మొదటి పది రోజులకే టికెట్ రేట్లు పెంచేలా అనుమతులు ఇచ్చారు ప్రభుత్వం. అప్పర్ క్లాస్..150 రూపాయలు, లోయర్ క్లాస్ 100 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 200 రూపాయలు మాత్రమే పెంచుకునేలా అనుమతులు ఇచ్చారు. అలాగే ముందు రోజు రాత్రి 9 గంటలకు షోకి కూడా అనుమతి ఇచ్చారు. దానికి 600 పెంచుకునేలా అనుమతి ఇచ్చారు.

Also See : భార్యతో పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్.. హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్..

తాజాగా తెలంగాణలో కూడా హరిహర వీరమల్లు సినిమాకు టికెట్ రేట్లు పెంచారు. పుష్ప 2 సినిమాకు సంధ్య థియేటర్ వద్ద జరిగిన సంఘటన తర్వాత రేట్లు పెంచము, స్పెషల్ షోలకు పర్మిషన్ ఇవ్వము అని చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. కానీ హరిహర వీరమల్లు సినిమా చారిత్రాత్మిక సినిమా కాబట్టి టికెట్ రేట్లు, స్పెషల్ షోలకు పర్మిషన్ ఇచ్చారు.

తెలంగాణలో ముందు రోజు రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోకి అనుమతి ఇస్తూ 600 రూపాయలు టికెట్ రేటు పెంచుకోడానికి అనుమతి ఇచ్చారు. 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మల్టిప్లెక్స్ లకు 200 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్ కి 150 రూపాయలు పెంచారు. అలాగే 28వ తేదీ నుంచి ఆగస్టు 2 వరకు 150 రూపాయలు మల్టిప్లెక్స్ లకు, 106 రూపాయలు సింగిల్ స్క్రీన్స్ కి పెంచుతూ అనుమతులు ఇచ్చారు. అలాగే రోజుకు 5 షోలకు పర్మిషన్ ఇచ్చారు.

Also Read : Mahesh Babu : శ్రీలంకకు వెళ్తున్న మహేష్ బాబు.. షూటింగ్ కోసమా? వెకేషన్ కోసమా? ఫ్లైట్ లో ఫోటో వైరల్..