Telangana High Court Serious on Pushpa 2 Ticket Rates
Pushpa 2 Ticket Price : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. అయితే సినిమాకు భారీ హైప్ ఉండటంతో టికెట్ రేట్లు కూడా భారీగా పెంచారు. ఒక రోజు ముందు అంటే రేపు రాత్రి వేసే ప్రీమియర్ షోలకు అయితే ఏకంగా 800 పెంచారు. అంటే ఒక్కో టికెట్ రేటు 1100 నుంచి 1200 వరకు ఉండనుంది. ఈ టికెట్ రేట్లు చూసి ప్రేక్షకులతో పాటు ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోయారు.
అసలు ఇంత రేటు ఒక్కో టికెట్ కి పెట్టి చూస్తారా అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. 500 అంటేనే ఎక్కువ అనుకుంటే ఏకంగా 1000 పైన ఉండటంతో నిర్మాతలపై విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే పుష్ప 2 టికెట్ రేట్లపై ఓ జర్నలిస్ట్ తెలంగాణ హైకోర్టులో కేసు వేశారు. దీనికి సంబంధించి హైకోర్టులో వాదన జరిగింది.
Also Read : Pushpa 3 – Vijay Deverakonda : పుష్ప 3 గురించి విజయ్ దేవరకొండ ఎప్పుడో చెప్పేశాడుగా.. 2022 ట్వీట్ వైరల్..
బెనిఫిట్ షో ఎవరి బెనిఫిట్ కోసం అంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. బెనిఫిట్ షో ద్వారా వచ్చిన డబ్బులు ఎస్క్రో అకౌంట్ లో పెట్టాలని అన్నారు. దీనికి రెండు వారాలు సమయం కావాలని మైత్రి మూవీ మేకర్స్ న్యాయవాది అడిగారు. కోర్టు రెండు వారాలకు విచారణ వాయిదా వేసింది. రెండు వారాలు అంటే సినిమా బెనిఫిట్ షో, సినిమా రిలీజ్ అయిపోతుంది అంటూ పిటిషినర్ తరపు న్యాయవాది వాదించారు.
అయితే ఈ విషయంలో 800 పైన పెట్టి సామాన్యుడు ఎలా సినిమా చూస్తాడు? ఓ కుటుంబం నుంచి 10 మంది సినిమాకు వెళ్తే 10 వేలు ఖర్చుపెట్టాలా అని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని సమాచారం.