Pushpa 3 – Vijay Deverakonda : పుష్ప 3 గురించి విజయ్ దేవరకొండ ఎప్పుడో చెప్పేశాడుగా.. 2022 ట్వీట్ వైరల్..
అసలు పుష్ప 3 సినిమా ఉందని అందరికంటే ముందు విజయ్ దేవరకొండనే చెప్పాడు.

Vijay Deverakonda 2022 Tweet about Pushpa Movie Goes Viral
Pushpa 3 – Vijay Deverakonda : ప్రస్తుతం అన్నిచోట్లా పుష్ప హవా నడుస్తుంది. 5వ తేదీన పుష్ప 2 సినిమా రిలీజ్ కాబోతుండటంతో ఫ్యాన్స్, ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. రేపు రాత్రికే ప్రీమియర్ షోలు పడనున్నాయి. అయితే పుష్ప 2 సినిమా తర్వాత పుష్ప 3 కూడా ఉందని ఇప్పటికే మూవీ యూనిట్ అధికారికంగా తెలిపారు. నిర్మాతలు, సుకుమార్, అల్లు అర్జున్, ఫహద్ ఫాజిల్.. వివిధ సందర్భాల్లో పుష్ప 3 సినిమా ఉంటుందని చెప్పారు.
నిన్న రాత్రి జరిగిన పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా సుకుమార్.. బన్నీ ఇంకో మూడేళ్లు సమయం ఇస్తే పుష్ప 3 తీస్తానని చెప్పాడు. తాజాగా రసూల్ పుకుట్టి కూడా పుష్ప 2 ఫైనల్ సౌండ్ మిక్సింగ్ అయ్యాక స్క్రీన్ పై పుష్ప 3 ఉన్న ఫోటో లీక్ చేసాడు. పుష్ప 3 – ది ర్యాంపేజ్ అనే టైటిల్ తో ఆ సినిమా ఉండబోతుందని, పుష్ప 2 చివర్లో లీడ్ ఇస్తారని తెలుస్తుంది. అయితే పుష్ప 3 సినిమా ఉంది కానీ అది తీస్తారా, తీస్తే ఎప్పుడు తీస్తారు అనేదానిపై క్లారిటీ లేదు.
Also Read : Pushpa 3 : బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ.. పుష్ప 3 టైటిల్ కూడా ఫిక్స్.. ఏంటంటే..
అయితే అసలు పుష్ప 3 సినిమా ఉందని అందరికంటే ముందు విజయ్ దేవరకొండనే చెప్పాడు. 2022లో విజయ్ దేవరకొండ సుకుమార్ పుట్టిన రోజు నాడు ఆయనతో దిగిన ఫోటో షేర్ చేసి.. 2021 – The Rise, 2022 – The Rule, 2023 – The Rampage అని పుష్ప సినిమా గురించి అప్పుడే హింట్ ఇచ్చేసాడు. అంటే పుష్ప 3 పార్ట్స్ అని అప్పుడే సుకుమార్ విజయ్ కి చెప్పినట్టు తెలుస్తుంది. పుష్ప 2 సినిమా వస్తున్న తరుణంలో విజయ్ దేవరకొండ పోస్ట్ వైరల్ గా మారింది. అయితే విజయ్ చెప్పినట్టు సంవత్సరానికి ఒక సినిమా రావాలి కానీ చాలా లేట్ అయి 2024 లో పుష్ప 2 వస్తుంది. మరి పుష్ప 3 ఎప్పుడు వస్తుందో చూడాలి.
Happy Birthday @aryasukku sir – I wish you the best of health & happiness!
Cannot wait to start the film with you 🙂 love and hugs 🤗🤍
2021 – The Rise
2022 – The Rule
2023 – The Rampage pic.twitter.com/lxNt45NS0o— Vijay Deverakonda (@TheDeverakonda) January 11, 2022
ఇక విజయ్ కి, బన్నీకి మధ్య మంచి అనుబంధం ఉంది. విజయ్ రెగ్యులర్ గా బన్నీకి తన రౌడీ బ్రాండ్ నుంచి బట్టలు పంపిస్తుంటాడు. బన్నీ కూడా ఆ గిఫ్ట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి విజయ్ కి థ్యాంక్యూ చెప్తాడు. రీసెంట్ గా పుష్ప 2 సినిమాకు కూడా విజయ్ అల్లు అర్జున్ కి రౌడీ బ్రాండ్ డ్రెస్సులు పంపించాడు.