telecom office locked heroine Anna Rajan in a room issue goes viral in Malayalam film industry
Anna Rajan : మలయాళం హీరోయిన్ అన్నా రాజన్ కి చేదు అనుభవం ఎదురైంది. ‘అంగమలి డైరీస్’ సినిమాతో మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చింది అన్నా రాజన్. ఆ తర్వాత ‘వేలిపడింతె పుస్తకం’, ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’.. లాంటి పలు సినిమాల్లో నటించి మెప్పించింది.
తాజాగా అన్నా రాజన్ ముఖానికి మాస్క్ పెట్టుకొని సాధారణ మహిళలా అలువ మున్సిపల్ కార్యాలయం సమీపంలోని ఓ టెలికాం కంపెనీ ఆఫీస్‌కు సిమ్ కార్డు కోసం వెళ్లింది. అక్కడి సిబ్బంది ఆమెని గుర్తించలేదు. అయితే సిమ్ తీసుకునే విషయంలో అన్నాకు, అక్కడి సిబ్బందికి మధ్య గొడవ జరగడంతో సిబ్బంది ఆమెను లోపలే ఉంచి తాళం వేశారు. బయటకి వచ్చాక ఈ ఘటనపై అన్నా రాజన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన పోలీసులు గొడవని సామరస్యంగా పరిష్కరించారు.
Murali Mohan : మురళీ మోహన్ పాలిటిక్స్ నుంచి తప్పుకుంటున్నారా?
ఈ ఘటనపై అన్నా రాజన్ మీడియాతో మాట్లాడుతూ.. ”నేను ఓ సిమ్ కార్డు కోసం టెలికాం కంపెనీకి వెళ్లాను. నేను నటిగా కాకుండా మాములు మహిళగా వెళ్లడంతో ఎవరు గుర్తుపట్టలేదు. సిమ్ కార్డు తీసుకునే విషయంలో నాకు, ఆఫీస్ లోని సిబ్బందికి మధ్య మధ్య గొడవ జరిగింది. వాళ్ళు కోపంతో నన్ను లోపలే ఉంచి తాళం వేశారు. నేను వారిపై పోలీస్ కేసు పెట్టాను. వారు తర్వాత ఇలా చేసినందుకు నాకు క్షమాపణలు చెప్పారు కాబట్టి నేను కేసు వెనక్కి తీసుకున్నాను” అని తెలిపింది. దీంతో ఈ ఘటన మలయాళ సినీ పరిశ్రమలో చర్చగా మారింది.