Murali Mohan : మురళీ మోహన్ పాలిటిక్స్ నుంచి తప్పుకుంటున్నారా?

గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ లో చిరంజీవి మురళీ మోహన్ గురించి మాట్లాడుతూ.. ''నేను, మురళీ మోహన్ అప్పుడప్పుడు కలిసి మాట్లాడుకుంటాము. లైఫ్ ఎలా ఉంది అంటే బోర్ కొడుతుంది, పాలిటిక్స్ పక్కన పెట్టేద్దాము అనుకుంటున్నాను, ఓపిక లేదు పార్టీ వాళ్ళకి కూడా..............

Murali Mohan : మురళీ మోహన్ పాలిటిక్స్ నుంచి తప్పుకుంటున్నారా?

Murali Mohan leaves politics chiranjeevi comments goes viral

Murali Mohan :  చిరంజీవి హీరోగా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. సినిమా చూసిన ప్రేక్షకులంతా బాస్ ఈజ్ బ్యాక్ అంటున్నారు. చాలా రోజుల తర్వాత భారీ విజయం సాధించడంతో అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. కలెక్షన్స్ కూడా బాగా వస్తున్నాయి ఈ సినిమాకి. తాజాగా గాడ్ ఫాదర్ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో అందరూ చిరంజీవిని పొగిడేశారు.

ఇక ఈ ఈవెంట్లో చిరంజీవి అక్కడున్న వాళ్ళందరికి స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తూ మాట్లాడారు. ఈ క్రమంలో మురళీ మోహన్ గురించి కూడా మాట్లాడారు. మురళీ మోహన్ ఒకప్పుడు స్టార్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి కొన్ని సంవత్సరాల నుంచి సినిమాలకి దూరంగా ఉన్నారు. మళ్ళీ గాడ్ ఫాదర్ సినిమాతో తెరపై కనిపించారు. మురళీ మోహన్ రాజకీయాల్లో కూడా ఎంతో యాక్టీవ్ గా ఉన్నారు. గతంలో టీడీపీ పార్టీ నుంచి రాజమండ్రి ఎంపీగా కూడా ఉన్నారు. గత కొన్ని రోజులుగా రాజకీయాలకి కూడా దూరంగా ఉంటున్నారు. తాజాగా గాడ్ ఫాదర్ ఈవెంట్లో మురళీ మోహన్ గురించి చిరంజీవి చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి.

Mega 154 : మెగా 154 సినిమా గురించి లీక్ చేసేసిన చిరంజీవి

గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ లో చిరంజీవి మురళీ మోహన్ గురించి మాట్లాడుతూ.. ”నేను, మురళీ మోహన్ అప్పుడప్పుడు కలిసి మాట్లాడుకుంటాము. లైఫ్ ఎలా ఉంది అంటే బోర్ కొడుతుంది, పాలిటిక్స్ పక్కన పెట్టేద్దాము అనుకుంటున్నాను, ఓపిక లేదు పార్టీ వాళ్ళకి కూడా చెప్పేశాను అన్నారు. మళ్ళీ సినిమాల్లోకి సరదాగా వచ్చి చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పారు. నేను నిజంగా చేస్తారా మళ్ళీ అని అడిగాను చేస్తాను అన్న వెంటనే ఈ సినిమాలో ఓ చిన్న క్యారెక్టర్ చేశారు. ఇది ఆయన కంబ్యాక్ కూడా ఇందులో చిన్న క్యారెక్టర్ చేసినా త్వరలో మరిన్ని సినిమాలు చేయాలి ఆయన” అని తెలిపారు.