T Ramarao
Tatineni Rama Rao: ప్రముఖ సినీ దర్శకుడు తాతినేని రామారావు కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యం బాధపడుతున్న ఆయన చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ కాలేజీ, దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ ‘యమగోల’ సినిమాకు తాతినేని దర్శకత్వం వహించారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తంచేశారు.
Telugu Stars: హిందీ సినిమా వద్దు.. పాన్ ఇండియా ముద్దు.. ఇదే మన హీరోల ఇంట్రెస్ట్!
తాతినేని రామారావు 1966నుంచి 2000 వరకు తెలుగు, హిందీలో డెబ్బైకి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. అనేక సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నారు. అన్ని రకాల జోనర్ చిత్రాలను రూపొందించి తన ప్రత్యేకతని చాటుకున్నారు. మారిన కాలం, సినిమా కొత్తపుంతలు తొక్కుతున్న నేపథ్యంలో ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు. తాతినేని రామారావు కృష్ణా జిల్లాలోని, కపిలేశ్వరపురంలో 1938లో జన్మించారు. ఆయన టి. రామారావుగా పాపులర్ అయ్యారు.
Telugu Heroes: హిందీ ఆడియన్స్ కోసం నాటు స్టెప్పులకు సిద్ధమవుతున్న మన హీరోలు!
1966లో ఆయన `నవరాత్రి` చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. అంతకంటే ముందు 1950 సమయంలో ఆయన తన కజిన్ దర్శకుడు టి.ప్రకాష్‌రావు, కోటయ్య ప్రత్యగాత్మ ల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. తొలి చిత్రం `నవరాత్రి` తమిళ సినిమాకి రీమేక్. అందులో శివాజీ గణేషన్, సావిత్రిలు జంటగా నటించారు. తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి కలిసి నటించారు. సినిమా సూపర్ హిట్ అవ్వడంతో దర్శకుడిగా టి. రామారావు వెనక్కి తిరిగి చూసుకోవాల్సి అవసరం రాలేదు.
Telugu Star Heroes: అసలే సమ్మర్.. వెకేషన్ మూడ్‌లో తెలుగు హీరోలు!
మాతృభాష తెలుగులో ఎన్నో విజయాలు సాధించిన తాతినేని రామారావు, దక్షిణాదిన సక్సెస్ చూసిన అనేక చిత్రాలను హిందీలో రీమేక్ చేశారు. అక్కడా జయకేతనం ఎగురవేశారు. అలాగే హిందీలో హిట్ అయిన పలు చిత్రాలను తెలుగులో రూపొందించీ విజయాలు సాధించారాయన. `తెలుగువారి హిందీ దర్శకుడు` అనే పేరు సంపాదించిన తాతినేని రామారావు.. ఎన్ని సినిమాలు తీసినా, ఆయన పేరు వినగానే ‘యమగోల’ డైరెక్టర్ అనేవారు ఉన్నారు. ఆ సినిమాతో తాతినేని రామారావు పేరు మారుమోగి పోయింది. అందుకే ఇప్పటికీ ‘యమగోల’ తాతినేని రామారావుగానే పిలుస్తారు.