Telugu Stars: హిందీ సినిమా వద్దు.. పాన్ ఇండియా ముద్దు.. ఇదే మన హీరోల ఇంట్రెస్ట్!

ఇప్పుడంటే పాన్ ఇండియా లెవెల్ కోసం మన హీరోలు బాలీవుడ్ గడప తొక్కుతున్నారు కానీ.. జనరల్ గా టాలీవుడ్ స్టార్స్ కి మొదటినుంచి హిందీ మీద ఆశలు పెద్దగా లేవు. ప్రెజెంట్ తెలుగు సినిమా సత్తా..

Telugu Stars: హిందీ సినిమా వద్దు.. పాన్ ఇండియా ముద్దు.. ఇదే మన హీరోల ఇంట్రెస్ట్!

Telugu Stars

Telugu Stars: ఇప్పుడంటే పాన్ ఇండియా లెవెల్ కోసం మన హీరోలు బాలీవుడ్ గడప తొక్కుతున్నారు కానీ.. జనరల్ గా టాలీవుడ్ స్టార్స్ కి మొదటినుంచి హిందీ మీద ఆశలు పెద్దగా లేవు. ప్రెజెంట్ తెలుగు సినిమా సత్తా చాటుతుంటే.. ఇక్కడి వాళ్లు కావాలని అక్కడి వాళ్లని మోహమాటం లేకుండా అడిగేస్తున్నారు.. తెగ పొగిడేస్తున్నారు. అసలు బాలీవుడ్ మీద క్రేజ్ లేకపోయినా సరే.. ముంబై మేకర్స్ బలవంతం చేస్తున్నారా.. ఒక్క సినిమా గురూ అంటూ వెంటపడుతున్నారా..?

Telugu Stars: నెక్స్ట్ ఏంటి.. కన్ఫ్యూజన్‌తో జుట్టు పీక్కుంటున్న ఫ్యాన్స్!

ఇలానే ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ అని ఇప్పుడు టాలీవుడ్ హీరోల వెంటపడుతున్నారు బాలీవుడ్ మేకర్స్. మాకు కాల్షీట్స్ ఇస్తే.. మీకు అదిరే పాన్ ఇండియా హిట్ ఇస్తామని బరోసా కూడా ఇచ్చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ నుంచి రామ్ చరణ్ భజన చేస్తోన్న బాలీవుడ్ డైరెక్టర్స్ అబ్బాస్-మస్తాన్.. రీసెంట్ గా ఓ ట్వీట్ చేశారు. చరణ్ తో వర్క్ చేయడం కోసం ఎదురుచూస్తున్నామని చెప్పుకొచ్చారు.

Stars Investments: రియల్ ఎస్టేట్స్ నుంచి స్టార్టప్స్ వరకూ.. అంతటా స్టార్స్ పెట్టుబడులే!

కరణ్ జోహార్ లాంటి బాలీవుడ్ ఫేమస్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్.. తెలుగు హీరోలను అందరికంటే ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాడు. విపరీతంగా ప్రేమ పెంచేసుకుంటున్నాడు. ట్రిపుల్ ఆర్ హీరోల చుట్టూ తిరుగుతున్నాడు. అల్లు అర్జున్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ లైగర్ ప్రొడ్యూసర్స్ లో ఒకరుగా ఉన్న కరణ్.. తెలుగు స్టార్ హీరోల ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నాడు.

Bollywood Stars: హిట్ టైమ్ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్న బాలీవుడ్ బడా స్టార్స్!

ఓం రౌత్ లాంటి డైరెక్టర్ ఒకడుగు ముందుకేసి ప్రభాస్ ను ఆదిపురుష్ గా లాంచ్ చేస్తున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్స్ మాత్రమే ప్రొడ్యూసర్స్, హీరోస్ చివరికి నార్త్ ఆడియెన్స్ కూడా తెలుగు హీరోలను బాలీవుడ్ కి రారమ్మంటున్నారు. రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్ లాంటి హీరోలు సైతం టాలీవుడ్ హీరోల కాంబినేషన్ లో కనిపించాలనే కోరికలను బయటపెడుతున్నారు.

Telugu Senior Heroes: కుర్ర భామలతో రొమాన్స్.. ఏజ్ బార్ హీరోల కష్టాలు

నార్త్ లో ఫుల్ క్రేజ్ ఉన్నా.. సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అవుతున్నా.. బీటౌన్ స్టార్ మేకర్స్ బ్రతిమాలుతున్నా.. మొదటి నుంచి డైరెక్ట్ బాలీవుడ్ సినిమా చేయడానికి మన హీరోలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. తప్పదనుకుంటే.. పాన్ ఇండియా వైడ్ కనెక్ట్ అవుతుందనుకుంటేనే ఒక్కొక్కరుగా అక్కడివారికి ఎస్ చెప్తున్నారు. తెలుగు సినిమానే పాన్ ఇండియా లెవెల్ లో సత్తా చాటుతుంటే.. అక్కిడికెళ్లి హిందీ సినిమా చేయడమేంటి అనేది వాళ్ల ప్రశ్న. ఫస్ట్ నుంచి బాలీవుడ్ కి దూరంగానే ఉన్న మహేశ్ బాబు.. తెలుగు సినిమా పవర్ చూపిస్తుంటే.. హిందీ సినిమా చేయాలా అని ప్రశ్నిస్తున్నారు.