Film Chamber of Commerce: చిన్న సినిమాల విధి విధానాలను విడుదల చేసిన తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి..

గత కొంతకాలంగా టాలీవుడ్ లో.. చిత్ర నిర్మాతలు టిక్కెట్లు ధరలు, ఓటిటి రిలీజులు, వీపీఎఫ్ చార్జీలు వంటి పలు సమస్యలను ఎదురుకోవడంతో.. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్ దీనిపై అధ్యయనం చేసి ఇటీవలే పెద్ద సినిమాలపై ఒక నిర్ణయానికి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే చిన్న సినిమాలపై త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుంటామని ప్రకటించిన ఫిల్మ్ ఛాంబర్, తాజాగా అందుకు సంబంధించిన నివేదికను విడుదల చేసింది.

Film Chamber of Commerce: గత కొంతకాలంగా టాలీవుడ్ లో.. చిత్ర నిర్మాతలు టిక్కెట్లు ధరలు, ఓటిటి రిలీజులు, వీపీఎఫ్ చార్జీలు వంటి పలు సమస్యలను ఎదురుకోవడంతో.. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్ దీనిపై అధ్యయనం చేసి ఇటీవలే పెద్ద సినిమాలపై ఒక నిర్ణయానికి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే చిన్న సినిమాలపై త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుంటామని ప్రకటించిన ఫిల్మ్ ఛాంబర్, తాజాగా అందుకు సంబంధించిన నివేదికను విడుదల చేసింది.

Balayya – Pawan Kalyan : అన్‌స్టాపబుల్ షోకి పవర్ స్టార్, త్రివిక్రమ్.. హింట్ ఇచ్చిన బాలయ్య

చిత్రసీమలోని పెద్దలతో, నిర్మాతల మండలితో చర్చించిన మండలి.. చిన్న సినిమాల విధి విధానాలను ఖరారు చేసింది. ముఖ్యంగా సినిమా బడ్జెట్ పై ద్రుష్టి పెట్టిన ఛాంబర్, రూ.4 కోట్లు బడ్జెట్ తో ఉన్న దానిని చిన్న సినిమాగా పరిగణిస్తున్నట్లు ప్రకటించింది. మిగతా వివరాలు క్రింద ఉన్నాయి.

* బడ్జెట్ రూ.4 కోట్లు పరిధిలో ఉంటె చిన్న సినిమా.
* షూటింగ్ స్టార్ట్ చేయడానికి 15 రోజులు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలి.
* సినిమా బడ్జెట్ మరియు షూటింగ్ కాలం గురించి.. ఛాంబర్ పొందుపరిచిన ప్రొఫార్మాలో
సినిమాకు పనిచేసే ముఖ్య టెక్నిషన్స్ తో సంతకం చేసి మండలికి అందజేయాలి.
* దరఖాస్తులో చెప్పిన కాలంలోనే షూటింగ్ పూర్తీ చేసుకొనే ప్రయత్నం చేయాలి.
* బడ్జెట్ ఎక్కువైతే దానికి పూర్తీ బాధ్యత దర్శకుడే తీసుకోవాలి.

ట్రెండింగ్ వార్తలు