Project K : ప్రభాస్ ప్రాజెక్టు K సినిమాకు ఫైటర్స్ యూనియన్ సెగ.. మళ్ళీ మొదటికొచ్చిన వేతనాల సమస్య..

ఇటీవల కొన్ని నెలల క్రితం వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సినీ కార్మికులు సమ్మె చేస్తామని ధర్నా చేశారు. ఈ అంశంపై అటు ఫిలిం ఫెడరేషన్, ఇటు ఫిలిం ఛాంబర్ మధ్య వివాదం రేగి ఆ తర్వాత కొన్ని చర్చల అనంతరం, కొన్ని రోజులు షూటింగ్స్ కూడా ఆపేసి.............

Project K : ప్రభాస్ ప్రాజెక్టు K సినిమాకు ఫైటర్స్ యూనియన్ సెగ.. మళ్ళీ మొదటికొచ్చిన వేతనాల సమస్య..

telugu film federation and fighters union issues raise again its effects to Prabhas Project K movie and other movies

Updated On : February 13, 2023 / 2:29 PM IST

Project K :  ఇటీవల కొన్ని నెలల క్రితం వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సినీ కార్మికులు సమ్మె చేస్తామని ధర్నా చేశారు. ఈ అంశంపై అటు ఫిలిం ఫెడరేషన్, ఇటు ఫిలిం ఛాంబర్ మధ్య వివాదం రేగి ఆ తర్వాత కొన్ని చర్చల అనంతరం, కొన్ని రోజులు షూటింగ్స్ కూడా ఆపేసి వివాదం ముగిసేలా చేశారు. వేతనాలు పెంచుతామని, చిన్న సినిమాలకి ఒకలాగా, పెద్ద సినిమాలకు ఒకలాగా ఉంటాయని ఈ మీటింగ్స్ లో డిసైడ్ చేశారు. అలాగే సినీ పరిశ్రమలో ఉన్న అన్ని యూనియన్స్ తో మాట్లాడి వేతనాల గురించి చర్చించారు.

అలాగే సినీ పరిశ్రమలో ఉన్న మరికొన్ని సమస్యలని కూడా తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ముందుకి తీసుకొచ్చినా వాటికి పరిష్కారం రాకుండా అవి సాగుతూనే ఉన్నాయి. వేతనాల సమస్యతో పాటు ఫైటర్స్ యూనియన్ సమస్య కూడా ఒకటి. అయితే తాజాగా తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఎంప్లాయిస్ వేతనాల సమస్య మళ్ళీ మొదటికొచ్చింది. అలాగే ఫైటర్స్ యూనియన్ సమస్యలని కూడా పరిష్కరించాలని ఉధృతం చేస్తున్నారు.

నేడు ఫిల్మ్ ఛాంబర్ లో ఫెడరేషన్, వేతన కమిటీ మధ్య సమావేశం జరిగింది. పెద్ద సినిమా, చిన్న సినిమాలను ఎలా నిర్ణయం తీసుకోవాలో ప్రతినిధులు చర్చిస్తున్నారు. రేపటివరకు ఈ సమస్య పరిష్కారం అవ్వొచ్చు అని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి తెలిపారు. అలాగే ఫైటర్స్ సమస్యలు తీర్చేవరకు షూటింగ్స్ ఆపాలన్నట్టు ఫైటర్స్ యూనియన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఇది జరిగితే ప్రభాస్ ప్రాజెక్టు K సినిమాకు ఫైటర్స్ యూనియన్ సెగ తగిలేలా ఉంది.

Indian Cinema : హద్దులు దాటిన ఇండియన్ సినిమా.. అదరగొడుతున్న ఓవర్సీస్ కలెక్షన్స్..

ప్రస్తుతం ప్రభాస్ ప్రాజెక్టు K సినిమా షూట్ లో యాక్షన్ సన్నివేశాలని హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ ఫైటర్స్ యూనియన్ సమ్మెకు దిగితే ప్రాజెక్ట్ k కి భారీగా నష్టం చేకూరుతుందని, షూటింగ్ ఆగిపోతుందని తెలుస్తుంది. అలాగే వేరే సినిమాలకు కూడా ఎఫెక్ట్ పడొచ్చని సమాచారం. మరి ఫిలిం ఫెడరేషన్, ఫిలిం ఛాంబర్ చర్చలు సఫలం అవుతాయో లేదో చూడాలి.