Telugu Indian Idol : తెలుగు టాప్ సింగింగ్ షో మొదలైంది.. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4..

మూడు సీజన్లు గ్రాండ్ గా పూర్తిచేసుకున్న తెలుగు ఇండియన్ ఐడల్ ఇప్పుడు నాలుగో సీజన్ మొదలుపెట్టింది.(Telugu Indian Idol)

Telugu Indian Idol : తెలుగు టాప్ సింగింగ్ షో మొదలైంది.. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4..

Telugu Indian Idol

Updated On : August 30, 2025 / 7:23 PM IST

Telugu Indian Idol : తెలుగు ఓటీటీ ఆహాలో గత మూడు సీజన్స్ గా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాక ఎంతోమంది సింగర్స్ ని బయటకు తీసుకొచ్చింది తెలుగు ఇండియన్ ఐడల్. ఈ షోలో పాల్గొన్న పలువురు ఇప్పుడు సినిమాల్లో కూడా అవకాశాలు తెచ్చుకుంటున్నారు. మూడు సీజన్లు గ్రాండ్ గా పూర్తిచేసుకున్న తెలుగు ఇండియన్ ఐడల్ ఇప్పుడు నాలుగో సీజన్ మొదలుపెట్టింది.(Telugu Indian Idol)

తెలుగు రాష్ట్రాల్లో, అమెరికాలో పలు ఆడిషన్స్ నిర్వహించి పలువురు ట్యాలెంట్ సింగర్స్ ని సెలెక్ట్ చేశారు. ఈ సింగర్స్ తో నాలుగో సీజన్ మొదలైంది. మరోసారి ఈ షో గల్లీ వాయిస్ ని గ్లోబల్ లెవెల్లో వినిపించడానికి సిద్ధమైంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్, గాయకులు కార్తీక్ మరియు గీతా మాధురి జడ్జెస్ గా ఉండగా శ్రీరామచంద్ర తో పాటు ఈ సారి సమీరా భరద్వాజ్ కూడా హోస్ట్ గా ఎంటర్టైన్మెంట్స్ ఇవ్వనుంది.

Also Read : Priyanka Chopra : సైలెంట్ గా ఆఫ్రికాలో మహేష్ – రాజమౌళి సినిమా షూటింగ్..? ప్రియాంక చోప్రా పోస్ట్ వైరల్..

ప్రతి శుక్ర, శని వారాలు కొత్త ఎపిసోడ్స్ ని ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. నిన్న ఆగస్టు 29 నుంచి తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 ఆహా ఓటీటీలో ప్రారంభమైంది. ఇప్పుడు జరిగే దశలో పాల్గొన్న వాళ్లందరిలో ఫైనల్ గా 12 మంది కంటెస్టెంట్స్ ను సెలెక్ట్ చేసి ఫైనల్ పోటీలో పాల్గొనేలా చేస్తారు.

ఇక ఈ షోలో మధ్యమధ్యలో పలువురు సెలబ్రిటీలు వస్తూ ఉంటారు. తమ సింగింగ్ ట్యాలెంట్ తో మెప్పించిన వారికి సినిమా అవకాశాలు కూడా ఈ స్టేజి నుంచి వస్తాయి. గత సీజన్స్ లో కప్పు గెలిచిన వారికి ఆల్రెడీ సినిమా అవకాశాలు వచ్చాయి. మరి ఈ సారి తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 కప్పు ఎవరు గెలుస్తారో చూడాలి.

Also See : Allu Arjun Ram Charan : చరణ్ కి అమ్మమ్మ.. బన్నీకి నానమ్మ.. ఆమె మరణంతో.. చాన్నాళ్లకు ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో.. ఫొటోలు వైరల్..