Telugu Indian Idol S4 : తెలుగు ఇండియన్ ఐడల్ 4 ప్రోమో వచ్చేసింది.. సింగ‌ర్ శ్రీరామచంద్రకు లేడీ సింగర్ షాక్‌..

తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ సీజ‌న్ 4 (Telugu Indian Idol S4) కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

Telugu Indian Idol S4 Launch Promo

Telugu Indian Idol S4 : తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేందుకు ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహా ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త కంటెంట్‌ను తీసుకువ‌స్తూ ఉంటుంది.

సినిమాలు, వెబ్ సిరీస్‌లు, గేమ్ షోలు, రియాలిటీ షోల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ ఉంటుంది.

తెలుగు ఇండియన్ ఐడల్ అంటూ లోకల్ సింగర్స్, తెలుగు వాళ్ళ ట్యాలెంట్ ని ఎంకరేజ్ చేయడానికి షోని తీసుకొచ్చి ఎంతో మంది గాయ‌నీగాయ‌కుల‌ను ప‌రిచయం చేసింది.

ఈ షో విజ‌య‌వంతంగా మూడు సీజ‌న్లు పూర్తి చేసుకుంది. ఇక నాలుగో సీజ‌న్‌తో అల‌రించేందుకు సిద్ధ‌మైంది.

Mana ShankaraVaraprasad Garu : ‘మన శంకర వరప్రసాద్ గారు’పై గుసగుసలు..

తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ సీజ‌న్ 4 (Telugu Indian Idol S4) కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సీజ‌న్ కోసం ఆడిష‌న్స్ నిర్వ‌హించారు. ఆగ‌స్టు 29 నుంచి ఈ షో ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్ర‌మంలో తాజాగా ప్రొమోను విడుద‌ల చేశారు. జ‌డ్జీలుగా తమన్, కార్తీక్, గీతా మాధురిలు వ్య‌హ‌రిస్తుండ‌గా.. శ్రీరామచంద్రతో పాటు సింగర్ సమీరా సైతం హోస్టింగ్ చేస్తున్న‌ట్లుగా అర్థ‌మ‌వుతోంది.

 

BEAUTY : అంకిత్ కొయ్య ‘బ్యూటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్‌.. థియేట‌ర్ల‌లోకి ఎప్పుడంటే..?

ఈ ప్రొమోలో కంటెస్టెంట్లు త‌మ పాట‌ల‌తో జ‌డ్డీల‌ను మెప్పించే ప్ర‌య‌త్నం చేశారు. ఒక‌రిని మించి మ‌రొక‌రు పాడిన‌ట్లుగా అర్థ‌మవుతోంది. మిరాజ్ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా హీరో తేజ స‌జ్జా సైతం సంద‌డి చేశాడు. మొత్తంగా ప్రొమో అదిరిపోయింది.