Telugu Music Director MM Keeravani Mother Passed Away
MM Keeravani: టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కీరవాణి తల్లి భానుమతి అనారోగ్య కారణాలతో బుధవారం నాడు ఆమె తుదిశ్వాస విడిచారు. గతకొద్ది రోజులుగా ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతుండగా, మూడు రోజుల క్రితమే ఆమెను కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు.
M M Keeravani : ఎమ్ ఎమ్ కీరవాణికి ఇంటర్నేషనల్ అవార్డు..
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భానుమతి గారు, బుధవారం నాడు కన్నుమూసినట్లుగా కిమ్స్ వైద్యులు తెలిపారు. ఆమె మృతితో కీరవాణి, రాజమౌళి కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, మరికాసేపట్లో భానుమతి భౌతికకాయాన్ని డైరెక్టర్ రాజమౌళి నివాసానికి తరలించనున్నారు. ఈ ఏడాదిలో ఆర్ఆర్ఆర్ సక్సెస్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకుని, పలు అవార్డులు రివార్డులు అందుకుంటున్న రాజమౌళి, కీరవాణి కుటుంబాల్లో భానుమతి మరణవార్త తీవ్ర విషాదం నింపింది.
Keeravani : ఇప్పటి సింగర్స్‌లో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లకి ఫేవరేట్ సింగర్స్ ఎవరో తెలుసా?
తల్లి మృతితో కీరవాణి తీవ్ర దు:ఖంలో మునిగిపోయారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ ప్రముఖులు కీరవాణికి తమ సంతాపం తెలుపుతున్నారు. ఆమె అంత్యక్రియలకు సంబంధించి కుటుంబ సభ్యుల నుంచి పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.