M M Keeravani : ఎమ్ ఎమ్ కీరవాణికి ఇంటర్నేషనల్ అవార్డు..

'ఆర్ఆర్ఆర్' అందుకుంటున్న అవార్డులు గురించి మాట్లాడుకొని సినీ ప్రేక్షకులకి అలుపు వస్తుంది గాని, చిత్ర యూనిట్ కి మాత్రం ఊపు వస్తుంది. రాజమౌళి సినిమాలకు సగ బలం అయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ సమకూర్చే కథలు అయితే, మరో సగ బలం అయన అన్న కీరవాణి అందించే సంగీతం. వీరిద్దరి సహకారం వల్లే రాజమౌళి ఇప్పుడు ఇండియన్ సినిమాని ఇంటర్నేషనల్ లెవెల్ లో నిలబెట్టాడు. ఇక విషయానికి వస్తే...

M M Keeravani : ఎమ్ ఎమ్ కీరవాణికి ఇంటర్నేషనల్ అవార్డు..

M M Keeravani won international award

Updated On : December 12, 2022 / 5:08 PM IST

M M Keeravani : ‘ఆర్ఆర్ఆర్’ అందుకుంటున్న అవార్డులు గురించి మాట్లాడుకొని సినీ ప్రేక్షకులకి అలుపు వస్తుంది గాని, చిత్ర యూనిట్ కి మాత్రం ఊపు వస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో వరుస అవార్డులు అందుకుంటూ, తన స్థాయిని అంచెలంచెలుగా పెంచుకుంటూ పోతుంది RRR. ఇప్పటికే అయిదు ఇంటర్నేషనల్ అవార్డ్స్ ని అందుకున్న ఈ సినిమా.. ఇప్పుడు మరో అంతర్జాతీయ అవార్డుని అందుకుంది.

RRR : IGN బెస్ట్ మూవీస్ నామినేషన్స్‌లో ‘ఆర్ఆర్ఆర్’..

రాజమౌళి సినిమాలకు సగ బలం అయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ సమకూర్చే కథలు అయితే, మరో సగ బలం అయన అన్న కీరవాణి అందించే సంగీతం. వీరిద్దరి సహకారం వల్లే రాజమౌళి ఇప్పుడు ఇండియన్ సినిమాని ఇంటర్నేషనల్ లెవెల్ లో నిలబెట్టాడు. ఇక విషయానికి వస్తే, RRRకి సంగీతం అందించిన ఎమ్ ఎమ్ కీరవాణి.. ‘బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్’గా అంతర్జాతీయ అవార్డుని అందుకున్నాడు.

లాస్ ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ప్రకటించే ఈ అవార్డ్స్‌లో.. 2022కు గాను ఎమ్ ఎమ్ కీరవాణి విన్నర్ గా నిలిచాడు. ఈ విషయాన్ని లాస్ ఏంజెల్స్ అసోసియేషన్ తమ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. కాగా ఇదే పురస్కారంలో రాజమౌళి ‘బెస్ట్ డైరెక్టర్’ నామినేషన్ లో నిలవగా.. రన్నర్ గా నిలిచాడు. మరి ఇదే ఊపులో ఈ మూవీ టీమ్ ఆస్కార్ ని కూడా దక్కించుకుంటదేమో చూడాలి.