OLD CONCEPT GLIMPSE : ‘ఓ‌ఎల్‌డీ’ మూవీ కాన్సెప్ట్ గ్లింప్స్ రిలీజ్.. ప్రేమని ఇలా కూడా చూపిస్తారా..

'ఓ‌ఎల్‌డీ' మూవీ కాన్సెప్ట్ గ్లింప్స్ ని దర్శకనిర్మాతలు రిలీజ్ చేసారు. ప్రేమని ఇలా కూడా చూపిస్తారా..

OLD CONCEPT GLIMPSE : ‘ఓ‌ఎల్‌డీ’ మూవీ కాన్సెప్ట్ గ్లింప్స్ రిలీజ్.. ప్రేమని ఇలా కూడా చూపిస్తారా..

Telugu new movie OLD CONCEPT GLIMPSE released

Updated On : April 10, 2024 / 1:56 PM IST

OLD CONCEPT GLIMPSE : ప్రేమని చూపించాలి గాని నవరసాల్లో చూపించవచ్చు. ఈక్రమంలోనే ప్రేమని ఒక కొత్త యాంగిల్ చూపిస్తూ ఆడియన్స్ ముందుకు రాబోతున్న సినిమా ‘ఓ‌ఎల్‌డీ’. ప్రేమని క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో చూపిస్తూ ఈ చిత్రాన్ని దర్శకుడు రాకేష్ శ్రీపాద తెరకెక్కిస్తున్నారు. త్వరలో షూటింగ్ మొదలు పెట్టుకోనున్న ఈ మూవీ నుంచి దసరా సందర్భంగా కాన్సెప్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేసారు.

ఈ గ్లింప్స్ లో చూపించిన కథ ఏంటంటే.. చిన్నప్పటి ఒక కుర్రాడు తన పక్కింటి అమ్మాయి పై ప్రేమని పెంచుకుంటూ వస్తాడు. ఆ అమ్మాయి తన పక్కన ఉంటే చాలా చూస్తూ బ్రతికేస్తా అన్న భావనతో ఉంటాడు. ఇక ఆ ప్రేమతో హత్యలు చేయడం మొదలుపెట్టి, ఆ తరువాత రచయితగా మారతాడు. ఈ కాన్సెప్ట్ ఆకట్టుకునేలా ఉంది. 2008 టైం పీరియడ్ తో ఈ సినిమా స్క్రీన్ ప్లే ఉండబోతుంది.

Also read : Samantha : నాగచైతన్యని ఎందుకు మోసం చేశావు.. నెటిజెన్ అడిగిన ప్రశ్నకి సమంత జవాబు..

మణికంఠ వారణాసి ఈ సినిమాలో మెయిన్ లీడ్ చేస్తున్నారు. అల్టిమేట్ సినీ ప్లానెట్ పాతకం పై జి రాణి నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మే మొదటి వారం నుంచి మొదలు కానుంది. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి జూన్ చివరి వారంలో విడుదల చేస్తామంటూ ప్రకటించారు.