Singer KK: సింగర్ కేకే మృతిపై టాలీవుడ్ స్టార్ హీరోల సంతాపం

ప్రముఖ నేపథ్య గాయుకుడు కేకే హఠాన్మరణంతో యావత్ సినీ టలోకం మూగపోయింది. ఆయన పాటిన పాటలకు వయసుతో సంబంధం లేకుండా అభిమానులు ఉన్నారు. అలాంటి గాయకుడు...

Telugu Star Heroes On Singer Kk Death

Singer KK: ప్రముఖ నేపథ్య గాయుకుడు కేకే హఠాన్మరణంతో యావత్ సినీ టలోకం మూగపోయింది. ఆయన పాటిన పాటలకు వయసుతో సంబంధం లేకుండా అభిమానులు ఉన్నారు. అలాంటి గాయకుడు హఠాత్తుగా మృతి చెందడంతో సినీ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కృష్ణకుమార్ కున్నత్.. అలియాస్ కేకే అనే పేరు సంగీత ప్రపంచంలో ఎలాంటి పాపులారిటీని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా ఆయన పాడిన పాటలు శ్రోతలను మరో లోకానికి తీసుకెళ్లేవి. అయితే కేకే మృతితో ఒక్కసారిగా సినీ రంగం తీవ్ర దిగ్భ్రాంతిలోకి వెళ్లింది.

Singer KK: మరణానికి ముందు ఆడిటోరియం వసతులపై కేకే కంప్లైంట్

కాగా.. కేకే తెలుగులోనూ పలు సూపర్ హిట్ సాంగ్స్ ను ఆలపించి, ఇక్కడి ఆడియెన్స్ ను తన మధురమైన వాయిస్ కు అభిమానులుగా మార్చుకున్నాడు. ఆయన యంగ్ హీరోల సినిమాలకు చాలా వరకు సూపర్ హిట్ సాంగ్స్ ను ఆలపించారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఉదయ్ కిరణ్, నితిన్, ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలకు కూడా ఆయన సాంగ్స్ పాడారు. ఖుషిలో ఏ మేరా జహా సాంగ్ అప్పట్లో ఓ సెన్సేషన్. హారిస్ జైరాజ్ స్వరపరిచిన ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్‌ను కూడా ఆయన పాడారు. వాసులో పాటకు ప్రాణం, ఘర్షణలో చెలియా చెలియా, అపరిచితుడులో కొండకాకి కొండెదాన, మున్నా సినిమాలోని పాటలను ఆయన పాడారు.

Singer KK : సింగర్ KK మృతిపై పవన్ కళ్యాణ్, చిరంజీవి సంతాపం..

అల్లు అర్జున్ కెరీర్ లో తొలి బిగ్గెస్ట్ హిట్ అయిన ఆర్య సినిమాలో ఫీల్ మై లవ్.. నా ఆటోగ్రాఫ్‌లో గుర్తుకొస్తున్నాయి.. గుడుంబా శంకర్‌లో లే లే లెలే.. జల్సాలో మై హార్ట్ ఈజ్ బీటింగ్ వంటి ట్రెండింగ్ సాంగ్స్ కేకే పాడినవే. తెలుగులో ఆయన 2014లో హిందీ మూవీ ఆషికీ రీమేక్ గా వచ్చిన నీ జతగా నేనుండాలి సినిమాలోని ‘కనబడునా’ అనే పాట ఆయన చివరి తెలుగు పాటగా నిలిచింది. కాగా.. ఆయన మృతిపై టాలీవుడ్ టాప్ హీరోలు మొదలుకొని, యంగ్ హీరోల వరకు అందరూ తమ సంతాపాన్ని వ్యక్త పరిచారు.