Singer KK: మరణానికి ముందు ఆడిటోరియం వసతులపై కేకే కంప్లైంట్

కోల్‌కతా వేదికగా కన్సెర్ట్ ముగించుకున్న కృష్ణకుమార్ కున్నత్.. (కేకే) కొద్ది గంటల్లోనే తుదిశ్వాస విడిచారు. చివరి షో సమయంలో బాగా చెమటలు పడుతున్నాయని, ఏసీ పనిచేయడం లేదంటూ కంప్లైంట్ ఇచ్చారని ఓ స్టూడెంట్ చెప్తున్నారు.

Singer KK: మరణానికి ముందు ఆడిటోరియం వసతులపై కేకే కంప్లైంట్

Singer Kk (1)

Updated On : June 1, 2022 / 1:20 PM IST

Singer KK: కోల్‌కతా వేదికగా కన్సెర్ట్ ముగించుకున్న కృష్ణకుమార్ కున్నత్.. (కేకే) కొద్ది గంటల్లోనే తుదిశ్వాస విడిచారు. చివరి షో సమయంలో బాగా చెమటలు పడుతున్నాయని, ఏసీ పనిచేయడం లేదంటూ కంప్లైంట్ ఇచ్చారని ఓ స్టూడెంట్ చెప్తున్నారు. కోల్‌కతా నజ్రుల్ మంచా ఆడిటోరియంలో ప్రోగ్రాం తర్వాత హోటల్ కు వెళ్లిన ఆయన అక్కడే కుప్పకూలిపోయాడు. CMRI హాస్పిటల్ కు తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు డిక్లేర్ చేశారు.

ప్రోగ్రాం జరిగిన కాసేపటికే తనకు ఆరోగ్యం సరిగాలేదని హోటల్ కు వెళ్లిపోతున్నట్లు వీడియోలో రికార్డ్ అయింది. 2వేల 500మంది మాత్రమే సరిపడే ఆడిటోరియానికి కెపాసిటీకి మించి 5వేల మంది హాజరయ్యారు. వైరల్ అవుతున్న మరో వీడియోలో.. తనకు ఉక్కబోతగా ఉందంటూ కంప్లైంట్ చేస్తున్న ఘటన రికార్డ్ అయింది.

అంతపెద్ద సెలబ్రిటీలు వచ్చి పర్‌ఫామ్ చేస్తున్నట్లు ఫెసిలిటీలు సరిగ చూసుకోపోతే ఎలా అంటూ బెంగాల్ బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్ ప్రశ్నించారు.

Read Also: ప్రఖ్యాత సింగర్ ‘కేకే’ కన్నుమూత

“అటువంటి పెద్ద సెలబ్రిటీలు పర్ఫామ్ చేసేటప్పుడు మిస్‌మేనేజ్మెంట్ జరగకుండా చూసుకోవాలి. ఇదంతా పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ బాధ్యతే. అటువంటి సెలబ్రిటీలకు ప్రొటెక్షన్ ఇవ్వలేకపోయారు. ఒకసారి ఊహించుకోండి. ఇటువంటి వాతావరణంలో.. హాల్ లోపలే ఉన్నప్పుడు ఏసీ స్విచాఫ్ అయిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది. ఈ పరిస్థితి కారణంగా అనారోగ్యానికి గురయ్యాడని చెప్పడం లేదు. కానీ, దీని ఫలితంగానే ప్రాణాలు కోల్పోయాడని చెప్పగలం. ప్రభుత్వానికి దేనిపైనా నియంత్రణ లేదనిపిస్తోంది. ఇది చాలా ఆందోళనకరంగా ఉంది” అంటూ కామెంట్ చేశారు.

కేకే మరణం పట్ల ప్రధాని మంత్రితో పాటు పలువురు రాజకీయ నాయకులు, నటులు సంతాపం వ్యక్తం చేస్తూ ట్విట్టర్లో పోస్టులు పెడుతున్నారు.