Singer KK: ప్రఖ్యాత సింగర్ ‘కేకే’ కన్నుమూత

కోల్‌కతా వేదికగా జరిగిన మ్యూజికల్ ప్రోగ్రాం తర్వాత ప్రఖ్యాత సింగర్ కేకే చనిపోయినట్లు తన అధికారిక ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్‌లో ధ్రువీకరించారు. ప్రోగ్రాం అయ్యాక హోటల్ కు వెళ్లిన ఆయన హఠాత్తుగా పడిపోయారు.

Singer KK: ప్రఖ్యాత సింగర్ ‘కేకే’ కన్నుమూత

Singer Kk

Singer KK: కోల్‌కతా వేదికగా జరిగిన మ్యూజికల్ ప్రోగ్రాం తర్వాత ప్రఖ్యాత సింగర్ కేకే చనిపోయినట్లు తన అధికారిక ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్‌లో ధ్రువీకరించారు. ప్రోగ్రాం అయ్యాక హోటల్ కు వెళ్లిన ఆయన హఠాత్తుగా పడిపోయారు. కోల్‌కతాలోని నజ్రుల్ మంచా ఆడిటోరియం నుంచి CMRI హాస్పిటల్ కు తీసుకెళ్లేసరికి అతను మరణించినట్లు కన్ఫమ్ చేశారు డాక్టర్లు.

‘కేకే’ స్టేజ్ నేమ్ గా పిలిచే కృష్ణకుమార్ కున్నత్ అనే ఈ వ్యక్తి 1990లలో టీనేజర్లలో ప్రత్యేక అభిమానం సంపాదించుకున్నాడు. స్కూల్, కాలేజి ఫేర్‌వెల్స్ లో ఈయన పాటలే వినిపించేవట.

“ఎవరైనా ఆర్టిస్ట్ స్టేజ్ ఎక్కితే అతనికి లేదా ఆమెకు చాలా శక్తి వచ్చేస్తుంది. ఏ పరిస్థితుల్లో ఉన్నామని కాదు, ఒకసారి స్టేజ్ ఎక్కానంటే, మొత్తం మర్చిపోతా. కేవలం పర్‌ఫామ్ చేయాలని ఒక్కటే ఆలోచిస్తా” అని తన అఫీషియల్ వెబ్‌సైట్‌లో రాసుకున్నారు కేకే.

Read Also : స్టేజిపై పాట పాడుతూ కుప్పకూలిపోయి మరణించిన సింగర్

 

కేకే.. హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, మళయాళం, మరాఠీ, బెంగాలీ ఇతర భాషల్లోనూ పాటలు పాడారు. 1999లో తొలి ఆల్బమ్ పల్ తో అరంగేట్రం చేసిన ఈయన.. 2000లలో బాలీవుడ్ పాపులర్ సాంగ్స్ పాడే స్థాయికి ఎదిగారు.

కేకే మృతి పట్ల యాక్టర్లు, రాజకీయ నాయకులు తమ సంతాపాన్ని ట్వీట్ల ద్వారా వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయన పాటలు అన్ని ఏజ్ గ్రూపులను కదిలిస్తాయని, ఎప్పటికీ వాటిని గుర్తుపెట్టుకుంటామని, అతని కుటుంబానికి.. అభిమానులు సంతాపాన్ని తెలిపారు.