Singer KK : సింగర్ KK మృతిపై పవన్ కళ్యాణ్, చిరంజీవి సంతాపం..

తాజాగా KK మృతిపై పవన్ కళ్యాణ్, చిరంజీవి సంతాపం తెలియచేశారు. ''కె.కె.గా సుపరిచితులైన ప్రముఖ గాయకుడు శ్రీ కృష్ణకుమార్ కున్నత్ గారి అకాల మరణం బాధ కలిగించింది. సినీ సంగీత ప్రపంచంలో......................

Singer KK : సింగర్ KK మృతిపై పవన్ కళ్యాణ్, చిరంజీవి సంతాపం..

Singer Kk (1)

Updated On : June 1, 2022 / 11:38 AM IST

Singer KK :   ప్రముఖ బాలీవుడ్ సింగర్ కృష్ణకుమార్ కున్నత్ (KK) హిందీలోనే కాకుండా దేశంలోని పలు భాషల్లో పాటలు పాడి ఎంతోమందిని అలరించారు. తెలుగులో కూడా ఎన్నో హిట్ సాంగ్స్ ని KK ఆలపించారు. ఆయన హఠాన్మరణం దేశంలోని సంగీతాభిమానులను, సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. ఆయన మృతిపై అన్ని పరిశ్రమల నుంచి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియచేస్తూ నివాళులు అర్పిస్తున్నారు.

తాజాగా KK మృతిపై పవన్ కళ్యాణ్, చిరంజీవి సంతాపం తెలియచేశారు. పవన్ కళ్యాణ్ ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. పవన్ కళ్యాణ్ మీడియాకి ఇచ్చిన ప్రకటనలో.. ”కె.కె.గా సుపరిచితులైన ప్రముఖ గాయకుడు శ్రీ కృష్ణకుమార్ కున్నత్ గారి అకాల మరణం బాధ కలిగించింది. సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక బాణీని కలిగిన గాయకుడు శ్రీ కె.కె. గారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. నా చిత్రాల్లో ఆయన ఆలపించిన గీతాలు అభిమానులను, సంగీత ప్రియులను అమితంగా మెప్పించాయి. ఖుషీ చిత్రం కోసం ‘ఏ మేరా జహా’ గీతం అన్ని వయసులవారికీ చేరువైంది. అందుకు శ్రీ కె.కె. గారి గాత్రం ఓ ప్రధాన కారణం. ‘జల్సా’లో మై హార్ట్ ఈజ్ బీటింగ్… అదోలా’, బాలు సినిమాలో ‘ఇంతే ఇంతింతే’, జానీలో ‘నాలో నువ్వొక సగమై’, ‘గుడుంబా శంకర్’లో ‘లే లే లే లే’.. గీతాలను నా చిత్రాల్లో ఆయన పాడారు. అవన్నీ శ్రోతలను ఆకట్టుకోవడమే కాదు, సంగీతాభిమానులు హమ్ చేసుకొనేలా సుస్థిరంగా నిలిచాయి. సంగీత కచేరీ ముగించుకొన్న కొద్దిసేపటికే హఠాన్మరణం చెందటం దిగ్భ్రాంతికరం. ఆయన చివరి శ్వాస వరకూ పాడుతూనే ఉన్నారు. శ్రీ కె.కె. గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఆ కుటుంబానికి భగవంతుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలి అని తెలిపారు.

Pawan Kalyan (1)

Singer KK: ప్రఖ్యాత సింగర్ ‘కేకే’ కన్నుమూత

ఇక సింగర్ కేకే మృతిపై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో.. కేకే మరణ వార్త నన్ను ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసింది. అద్భుతమైన గాయకుడు మరియు గొప్ప వ్యక్తి. కేకే నా కోసం ‘ఇంద్ర’లోని ‘దాయి దాయీ దామా’ పాడాడు. అతని కుటుంబానికి & సన్నిహితులకు మరియు ప్రియమైన వారికి నా హృదయపూర్వక సానుభూతి. అతని ఆత్మకు శాంతి కలుగుగాక అంటూ చిరంజీవి సంతాపం తెలియచేశారు.