‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ : హాబ్స్ అండ్ షా’ ప్రపంచ వ్యాప్తంగా ఆగష్ట్ 2న విడుదల కానుంది..
ప్రపంచ వ్యాప్తంగా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమాలకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటి వరకు ఈ సిరీస్‌లో వచ్చిన ఎనిమిది సినిమాలు ఆడియన్స్‌ని ఆకట్టకుని, వరల్డ్ వైడ్‌గా అయిదు బిలియన్ డాలర్లు వసూలు చేసాయి. ఇప్పుడు ఈ సిరీస్ నుండి ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ : హాబ్స్ అండ్ షా.. రాబోతుంది. రీసెంట్‌గా ఈ సినిమా తెలుగు థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. డ్వెయిన్ జాన్సన్, జేసన్ స్టాథామ్ మెయిన్ లీడ్స్‌గా నటించగా, డేవిడ్ లిచ్ డైరెక్ట్ చేసాడు.
భీభత్సమైన యాక్షన్‌తో, ఒళ్ళు గగుర్పొడిచే ఎడ్వంచర్స్‌తో ఉత్కంఠ భరింతంగా ఉందీ ట్రైలర్.. ‘హాబ్స్’ అనబడే ‘లా ఎన్ ఫోర్స్ మెంట్’ అధికారిగా ‘డ్వెయిన్ జాన్సన్’, మాజీ మిలిటరీ అధికారి ‘షా’ గా ‘జేసన్ స్టాథామ్’, ‘సైబర్ ఎనార్కిస్ట్’గా ‘ఇడ్రిస్ ఎల్బా’ విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడు. హాబ్స్, షా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడకపోయినా విలన్ పని పట్టడానికి ఒక్కటవుతారు. అక్కడినుండి వారి జర్నీ ఎలా కొనసాగింది.. వాళ్ళనుకున్నది సాధించడానికి ఏం చేసారు? అనేదే ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. ఒరిజినల్ ఫిలిం, సెవెన్ బక్స్ ప్రొడక్షన్స్, క్రిష్ మోర్గాన్ ప్రొడక్షన్స్ కలిసి నిర్మించగా, యూనివర్సల్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ : హాబ్స్ అండ్ షా’ ప్రపంచ వ్యాప్తంగా ఆగష్ట్ 2న విడుదల కానుంది.
వాచ్, హాబ్స్ అండ్ షా-తెలుగు ట్రైలర్