అనుకోని అతిథి – ఫస్ట్ లుక్
ఫాహద్ ఫాజిల్, సాయి పల్లవి జంటగా వివేక్ దర్శకత్వంలో ‘అథిరన్’.. తెలుగులో ‘అనుకోని అతిథి’ (అంతకుమించి) పేరుతో విడుదల కానుంది..

ఫాహద్ ఫాజిల్, సాయి పల్లవి జంటగా వివేక్ దర్శకత్వంలో ‘అథిరన్’.. తెలుగులో ‘అనుకోని అతిథి’ (అంతకుమించి) పేరుతో విడుదల కానుంది..
మలయాళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి కొంత గ్యాప్ తర్వా రానా సరసన ‘విరాట పర్వం’ సినిమా చేస్తోంది. ఇప్పుడు సాయి పల్లవి నటించిన మలయాళ సూపర్ హిట్ మూవీ తెలుగులో విడుదల కానుంది. ఫాహద్ ఫాజిల్, సాయి పల్లవి జంటగా వివేక్ దర్శకత్వంలో ‘అథిరన్’ అనే సినిమా రూపొందింది. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘అథిరన్’ మలయాళంలో సూపర్ హిట్ అయ్యింది.
విభిన్న కథా, కథనాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రాన్ని తెలుగులో ‘అనుకోని అతిథి’ (అంతకుమించి) పేరుతో డబ్ అవుతోంది. దసరా సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. 1972 కేరళ రాష్ట్రంలో జరిగిన యదార్ధ కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. త్వరలో విడుదల తేదీ ప్రకటించనున్నారు.
Read Also : కార్తీ ‘ఖైదీ’ – ట్రైలర్..
ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి, శాంతి కృష్ణ, లీనా, సుదేవ్ నాయర్ తదితరులు నటించిన ఈ సినిమాకి ఫోటోగ్రఫీ : అనూ మూతెడాత్, ఎడిటింగ్ : ఆయూబ్ ఖాన్, మ్యూజిక్ : P S జయశ్రీ, బ్యాగ్రౌండ్ స్కోర్ : జిబ్రాన్, నిర్మాతలు : అన్నంరెడ్డి కృష్ణ కుమార్, గోవిందా రవి కుమార్.