TG Vishwa Prasad said Gopichand injured while Ramabanam Movie shooting
TG Vishwaprasad : గోపీచంద్(Gopichand) చివరగా పక్కా కమర్షియల్(Pakka Commercial) సినిమాతో ప్రేక్షకులని అలరించాడు. త్వరలో రామబాణం(Ramabanam) సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. గోపీచంద్, డింపుల్ హయతి(Dimple Hayathi) జంటగా, జగపతి బాబు(Jagapathi Babu) ముఖ్య పాత్రలో శ్రీవాస్(Sriwass) దర్శకత్వంలో తెరకెక్కిన రామబాణం సినిమా మే 5న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory) నిర్మాణ సంస్థ నిర్మించింది.
తాజాగా రామబాణం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత, నిర్మాత టిజి విశ్వప్రసాద్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో రామబాణం సినిమా గురించి, తమ నిర్మాణ సంస్థ గురించి పలు ఆసక్తికర విషయాలని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే షూటింగ్ లో గోపీచంద్ కి గాయమైందని తెలిపారు.
ఇంటర్వ్యూలో టిజి విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. రామబాణం సినిమా కుటుంబ కథ చిత్రం. ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు. అన్నదమ్ముల అనుబంధంతో ఈ సినిమా తెరకెక్కింది. అలాగే నాణ్యమైన ఆహరం విశిష్టతను కూడా చెప్తుంది ఈ సినిమా. రామబాణం సినిమా ఫిబ్రవరిలోనే రిలీజ్ అనుకున్నాం. కానీ షూటింగ్ సమయంలో గోపీచంద్ కు గాయం అయింది. గోపీచంద్ రెస్ట్ తీసుకోవాల్సి రావడంతో మూడు నెలలు షూటింగ్ ఆగిపోయింది. గోపీచంద్ తిరిగి కోలుకున్నాక మళ్ళీ షూటింగ్ మొదలుపెట్టాము. అందుకే చిత్రీకరణ ఆలస్యం అవ్వడం వల్ల సినిమా రిలీజ్ ఆలస్యం అయింది అని తెలిపారు.
Karthi : నార్త్ వాళ్లకు పొన్నియిన్ సెల్వన్ అర్ధం చేసుకోవడం కొంచెం కష్టం.. కార్తీ కామెంట్స్..
దర్శకుడు శ్రీవాస్ – గోపీచంద్ కాంబినేషన్ లో లక్ష్యం, లౌక్యం లాంటి హిట్ సినిమాల తర్వాత మూడో సినిమాగా రామబాణం వస్తుండటంతో ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని భావిస్తున్నారు.