‘తకిట తథిమి కొట్టరా డీజే.. పుట్టినరోజే’

  • Published By: sekhar ,Published On : November 30, 2019 / 05:20 AM IST
‘తకిట తథిమి కొట్టరా డీజే.. పుట్టినరోజే’

Updated On : November 30, 2019 / 5:20 AM IST

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా.. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘ప్రతిరోజూ పండగే’. అల్లు అరవింద్ సమర్పణలో.. జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఇటీవల విడుదల చేసిన లిరికల్ సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. శనివారం ఉదయం ‘తకిట తథిమి’ లిరికల్ వీడియో రిలీజ్ చేశారు. 

Image
తమన్ ట్యూన్ కంపోజ్ చేయగా, కాసర్ల శ్యామ్ లిరిక్స్ రాశారు. రాహుల్ సిప్లిగంజ్ పాడాడు. ‘తకిట తథిమి కొట్టరా డీజే.. పుట్టినరోజే.. ఎక్కితే ఫ్లైటు, ఎదుగుతుంటే హైటు, ఇచ్చేస్తుంటే ట్రీటు.. కాదోయ్ నువ్వే గ్రేటు.. తోడుగా ఉంటూ కన్నోళ్లనే కంటూ.. పంచుకుంటే హార్టు అదే పెద్ద గిఫ్టు’ అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటోంది.

బర్త్‌డే నేపథ్యంలో రెట్రో థీమ్‌తో సాగే ఈ పాటలో హీరో హీరోయిన్లతో పాటు సినిమాలోని ప్రధాన తారాగణమంతా కనిపిస్తున్నారు. కుటుంబ బంధాలు, భావోద్వేగాలు ప్రధానంగా రూపొందుతున్న ‘ప్రతిరోజూ పండగే’.. సినిమా డిసెంబర్ 20న విడుదల కానుంది. సంగీతం : థమన్, కెమెరా : జయ కుమార్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : రవీందర్, నిర్మాత : బన్నీ వాసు.