వైరల్ అవుతున్న రజినీ దర్బార్ పిక్స్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రజినీ 'దర్బార్' వర్కింగ్ స్టిల్స్.. ఈ సినిమాలో మురగదాస్ రజినీని డ్యుయల్ రోల్‌లో చూపించబోతున్నాడని కోలీవుడ్ టాక్..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రజినీ ‘దర్బార్’ వర్కింగ్ స్టిల్స్.. ఈ సినిమాలో మురగదాస్ రజినీని డ్యుయల్ రోల్‌లో చూపించబోతున్నాడని కోలీవుడ్ టాక్..
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా, టాప్ డైరెక్టర్ ఏ.ఆర్.మురగదాస్ డైరెక్షన్‌లో, లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ‘దర్బార్’ షూటింగ్ ఇటీవలే ముంబాయిలో స్టార్ట్ అయ్యింది. నయనతార కూడా షూటింగ్‌లో జాయిన్ అయ్యింది. దాదాపు 25 ఏళ్ళ తర్వాత రజినీ ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు.. మురగదాస్ రజినీని డ్యుయల్ రోల్‌లో చూపించబోతున్నాడని కోలీవుడ్ టాక్.. ఇదిలా ఉంటే, రీసెంట్‌గా దర్బార్‌లో రజినీ వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆ పిక్స్‌లో రజినీ పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్‌లోనూ, నార్మల్ కాస్ట్యూమ్స్‌తోనూ ఉన్నాడు.. లుక్ వైజ్ రజినీ యంగ్‌గా కనిపిస్తున్నాడు. గాగుల్స్ పెట్టుకుని తన స్టైల్‌లో కూల్‌గా నవ్వుతూ ఉన్న రజినీ పిక్స్.. ఫ్యాన్స్‌తోపాటు, ఆడియన్స్‌ని కూడా ఆకట్టుకుంటున్నాయి. 2020 సంక్రాంతికి దర్బార్ రిలీజ్ కానుంది. ఈ సినిమాకి కెమెరా : సంతోష్ శివన్, ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, సంగీతం : అనిరుధ్, లిరిక్స్ : వివేక్.