Thaman comments on Prabhas Raja saab movie goes viral
వరుస విజయాలతో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మంచి జోష్‌లో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న చిత్రాల్లో రాజాసాబ్ ఒకటి. మారుతి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్‌లు కథానాయికలు. సంజయ్ దత్, మురళి శర్మ, అనుపమ్ ఖేర్ లు కీలక పాత్రలను పోషిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ సినిమా పై ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాడు. ఈ చిత్ర ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని జపాన్‌లో చేయబోతున్నట్లుగా చెప్పాడు. అందుకనే జపనీస్ వెర్షన్‌లో ఓ సాంగ్ చేయాలని చిత్రబృందం కోరినట్లు వెల్లడించారు.
Vishal Health : విశాల్‌కు ఏమైంది.. అసలు విషయాన్ని చెప్పిన ఖుష్బూ..
ఈ మూవీలో ఓ డ్యూయెట్, స్పెషల్ సాంగ్, ముగ్గురు హీరోయిన్లతో ఓ పాట, హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఉన్నాయన్నారు. ఈ చిత్రం పై ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్లి చూస్తే అంత ఎక్కువగా ఎంజాయ్ చేస్తారని అన్నాడు.
వాస్తవానికి ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం వెల్లడించింది. ఇక ఈ చిత్రం గురించి నిర్మాత విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ.. వరల్డ్ బిగ్గెస్ట్ హర్రర్ చిత్రంగా ఉంటుందన్నారు. ప్రభాస్ లుక్, ముగ్గురు హీరోయిన్స్, సంజయ్ దత్ పాత్ర ఇలా కొన్ని ఎలిమెంట్స్ సినిమా స్థాయిని అమాంతం పెంచేస్తున్నాయన్నారు.
Thaman About Raja Saab Movie 🔥🔥🔥🔥🔥🔥🔥#Prabhas #TheRajaSaab pic.twitter.com/I9orRH5CPV
— CINEMA PANNEL (@cinemapannel) January 7, 2025