Thaman : ఆ డీజే సాంగ్‌ని కాపీ కొట్టిన థమన్.. ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ పై మీమ్స్..

గుంటూరు కారం 'కుర్చీ మడతపెట్టి' సాంగ్ పై మీమ్స్. ఆ డీజే సాంగ్‌ని కాపీ కొట్టిన థమన్ అంటూ..

Thaman is copied Kurchi Madathapetti Song in Mahesh babu Guntur Kaaram

Thaman : త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు మూడోసారి నటిస్తున్న చిత్రం ‘గుంటూరు కారం’. ఈసారి పక్కా మాస్ మసాలా మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్న ఈ చిత్రం నుంచి ఒక్కో పాటని రిలీజ్ చేసుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే.

నేడు ఈ మూవీ నుంచి ఊర మాస్ బీట్ ‘కుర్చీ మడతపెట్టి’ పాటని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ఇటీవల కాలంలో బాగా ట్రెండ్ అయిన ‘కుర్చీ మడతపెట్టి’ మాస్ డైలాగ్ తో పాట లిరిక్స్ రాయడంతో అందరూ థ్రిల్ ఫీల్ అయ్యారు. దీంతో రిలీజ్ చేసిన కొద్దీ నిమిషాల్లోనే ఈ పాట వైరల్ గా మారిపోయింది. ఇక ఈ పాట విన్న కొంతమంది.. ఇది కాపీ సాంగ్ అంటూ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు.

Also read : Prashanth Varma : ఒక్క డైరెక్టర్ చేతిలోనే మొత్తం 12 సూపర్ హీరో సినిమాలు.. నెక్స్ట్ ‘అధీర’..

ఈ డైలాగ్ పై గతంలోనే యూట్యూబ్‌లో వచ్చిన డీజే సాంగ్‌ని థమన్ ఇప్పుడు పూర్తిగా కాపీ చేశారని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ఆ పాత డీజే సాంగ్ ని కూడా పోస్ట్ చేస్తూ వస్తున్నారు. మహేష్ బాబుని ఇంత మాస్ సాంగ్ లో చూడడం అభిమానులను సంతోష పరుస్తున్నా.. ఆ పాట కాపీ అనే విషయం వారికీ ఆగ్రహం తెప్పిస్తుంది. కాగా ఈ ‘కుర్చీ మడతపెట్టి’ పూర్తీ సాంగ్ ని రేపు రిలీజ్ చేయనున్నారు.

ఇది ఇలా ఉంటే, రిలీజ్ చేసిన ప్రోమోలో మహేష్, శ్రీలీల మాస్ డాన్స్ అదిరిపోయింది. ఆ స్టెప్స్ చూసిన ఆడియన్స్.. థియేటర్ లో ఈ సాంగ్ కి నిజంగా కుర్చీలు ఇరిగిపోవాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ మాస్ ప్రోమోని మీరు కూడా ఒకసారి చూసేయండి.

కాగా గుంటూరు కారం సినిమా జనవరి 12న రిలీజ్ కాబోతుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. మరి అతడు, ఖలేజాతో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన మహేష్, త్రివిక్రమ్ కాంబో.. ఈ మూవీతో ఆకట్టుకుంటారా లేదా చూడాలి.