Thaman or Anirudh composing the music for Pawan Kalyan's next movie.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కొత్త సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఉస్తాద్ భగత్ సింగ్ తరువాత ఆయన కొత్త సినిమా చేయడమో అని చాలా మంది అనుకున్నారు. కానీ, అనూహ్యంగా దర్శకుడు సురేందర్ రెడ్డితో కొత్త సినిమాను మొదలుపెట్టేశాడు. దీనికి సంబదించిన అధికారిక ప్రకటన కూడా ఈమధ్యే వచ్చేసింది. తన స్నేహితుడు రామ్ తాళ్లూరికి ఇచ్చిన మాట మేరకు ఈ సినిమాను చేస్తున్నాడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan).
ఇక ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు కోసం వక్కంతం వంశీ కథను అందిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. అందుకోసం మంగళగిరి లోని పవన్ కళ్యాణ్ ఆఫీస్ దగ్గర భారీ సెట్ వేయనున్నారు. అక్కడే ఈ సినిమాషూటింగ్ దాదాపు కంప్లీట్ కానుంది. ఓపక్క రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తూనే మరోపక్క సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు పవన్ కళ్యాణ్.
Anil Ravipudi: హీరో కంటే ముందే విలన్ సెట్ అయ్యాడు.. అనిల్ నెక్స్ట్ మూవీపై క్రేజీ అప్డేట్
ఇదిలా ఉంటే, ఈ సినిమాకు సంబదించిన ఒక విషయంలో మేకర్స్ కన్ ఫ్యూజన్ లో పడ్డారట. అదేంటంటే, పవన్ కళ్యాణ్ సినిమాకు మ్యూజిక్ అందించేది ఎవరు అని. అందుకోసం ఇద్దరినీ ఆప్షన్ లో పెట్టుకున్నారు మేకర్స్. వారిలో ఒకరు తమన్ కాగా, మరొకరు అనిరుధ్. ఈ ఇద్దరిలో ఎవరిని తీసుకుంటే బాగుంటుంది అని మేకర్స్ కన్ ఫ్యూజన్ లో పడ్డారట. నిజానికి పవన్ కళ్యాణ్ తో తమన్ ట్రాక్ రికార్డ్ ఒక రేంజ్ లో ఉంది. పవన్ రీ ఎంట్రీ తరువాత చేసిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో, ఓజీ లాంటి సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్ అందించాడు తమన్.
ఇక అనిరుధ్ విషయానికి వస్తే ఆయన పవన్ కళ్యాణ్ తో చేసిన అజ్ఞాతవాసి సినిమా డిజాస్టర్ అయ్యింది. కానీ, ఆ సినిమాలో మ్యూజిక్ నెక్స్ట్ ల;లెవల్లో ఉంటుంది. ఇలా ఇద్దరు పవన్ కళ్యాణ్ కి బెస్ట్ మ్యూజిక్ అందించారు. మరి ఈ ఇద్దరిలో ఎవరు ఈ సినిమాకు మ్యూజిక్ చేస్తారు అనేది ఇంకా సస్పెన్స్ లోనే ఉంది. కానీ, ఫ్యాన్స్ నుంచి వినిపిస్తున్న టాక్ ఏంటంటే, ఇప్పటికే తమన్ తో నాలుగు సినిమాలు చేశాడు కదా, ఈ సినిమా కోసం అనిరుధ్ అయితే బాగుటుందని ఆశ పడుతున్నారట. ఇదే విషయాన్ని దర్శకుడు సురేందర్ రెడ్డికి మెసేజెస్ చేసి మరీ చెపుతున్నారట. చూడాలి మరి ఫైనల్ గా మేకర్స్ ఎవరిని ఫిక్స్ చేస్తారు అని.