Thaman: మహేష్ కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్న థమన్!
సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ మరో వారంలో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యింది. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న...

Thaman Working Hard For Mahesh Babu Sarkaru Vaari Paata
Thaman: సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ మరో వారంలో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యింది. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరికొత్త అవతారాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాను మే 12న రిలీజ్‌కు రెడీ చేయడంతో ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులను ముగించేందుకు చిత్ర యూనిట్ తెగ కష్టపడుతోంది.
Sarkaru Vaari Paata : మ.. మ.. మహేశా.. మాస్ సాంగ్‌తో రాబోతున్న సూపర్‌స్టార్..
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్‌కు ఫినిషింగ్ టచ్‌ను ఇస్తున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ థమన్. దీనికి సంబంధించిన పనులను దగ్గరుండి చూసుకుంటున్నాడు. దీని కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నాడు థమన్. తెల్లవారుజామున 5 గంటలకు కూడా ఈ సినిమా మ్యూజిక్‌కు సంబంధించిన మిక్సింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు థమన్. అయితే సర్కారు వారి పాట కోసం అద్భుతమైన సంగీతాన్ని అందించాడని.. థమన్ మ్యూజిక్‌ను థియేటర్లలో ప్రతిఒక్కరూ ఆస్వాదిస్తారని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట సెన్సార్ టాక్.. రన్ టైమ్ ఎంతంటే?
ఇక డాల్బీ అట్మోస్‌లో ఈ చిత్ర సంగీతాన్ని మిక్సింగ్ చేస్తుండటంతో థియేటర్లలో సౌండ్ బాక్సులు పగిలిపోవడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. థమన్ బీజీఎం ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అని.. మహేష్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌కు థమన్ సంగీతం తోడైతే ఆ సీన్ ఎలా ఉంటుందో మే 12న థియేటర్లలో చూడాల్సిందే అంటున్నారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోండగా, సముథ్రఖని, నదియా, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, బ్రహ్మాజీ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
View this post on Instagram