Thank You Movie : మాస్కోలో మైనస్ 14 డిగ్రీస్‌లో చైతు-రాశీ ఖన్నా..

నాగ చైతన్య-రాశీ ఖన్నా జంటగా నటిస్తున్న ‘థ్యాంక్ యు’ మూవీ ఫైనల్ షెడ్యూల్ కోసం టీం రష్యా వెళ్లారు..

Thank You Movie : మాస్కోలో మైనస్ 14 డిగ్రీస్‌లో చైతు-రాశీ ఖన్నా..

Chay Raashi

Updated On : January 27, 2022 / 4:25 PM IST

Thank You Movie: యువసామ్రాట్ నాగ చైతన్య, రాశీ ఖన్నా జంటగా.. టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ డైరెక్షన్‌లో వస్తున్న మూవీ ‘థ్యాంక్ యు’.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద దిల్ రాజు – శిరీష్ నిర్మిస్తున్నారు. చైతన్య పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన ‘థ్యాంక్ యు’ ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Oke Oka Jeevitham : ‘అమ్మా.. నే కొలిచే శారదవే.. నిత్యం నను నడిపే సారథివే’.. సిరివెన్నెలకే సాధ్యం..

రీసెంట్‌గా తండ్రి కింగ్ నాగార్జునతో కలిసి.. కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్‌లో చేసిన ‘బంగార్రాజు’ తో సాలిడ్ హిట్ కొట్టాడు చై. ఈ మూవీ సంక్రాంతి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘లాల్ సింగ్ చద్దా’ షూట్ కంప్లీట్ అయింది. ఏప్రిల్ 14న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు.

Naga Chaitanya : నాగ చైతన్య స్టైలిష్ షర్ట్ కాస్ట్ ఎంతో తెలుసా?

‘థ్యాంక్ యు’ ఫైనల్ షెడ్యూల్ కోసం టీం రష్యా వెళ్లారు. ప్రస్తుతం రష్యా క్యాపిటల్ మాస్కోలో షూటింగ్ జరుగుతుంది. అక్కడే కెమెరామెన్ పి.సి. శ్రీరామ్ బర్త్‌డేని సెలబ్రేట్ చేశారు యూనిట్. షూటింగ్ స్పాట్‌లో తీసుకున్న పిక్ సోషల్ మీడియాలో షేర్ చేసింది రాశీ ఖన్నా. ఈ ఏడాది వేసవిలో ‘థ్యాంక్ యు’ విడుదల కానుంది.

Thank You Movie Team

 

అక్కినేని ఫ్యామిలీకి ‘మనం’ వంటి మెమరబుల్ మూవీ ఇచ్చిన విక్రమ్ ఈ ‘థ్యాంక్ యు’ చిత్రాన్ని కూడా సరికొత్తగా తెరకెక్కిస్తున్నారు. బి.వి.ఎస్.రవి ఈ సినిమాకు కథనందిస్తున్నారు. తమన్ మ్యూజిక్, పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.