Tharun Bhascker : వెంకటేష్‌తో సినిమా ప్లాప్ అవుతుందని పక్కన పెట్టాను..
వెంకటేష్‌తో సినిమా ప్లాప్ అవుతుందని పక్కన పెట్టేశాను అంటూ దర్శకుడు తరుణ్ భాస్కర్ వైరల్ కామెంట్స్ చేశాడు.

Tharun Bhascker comments about his movie with Venkatesh
Tharun Bhascker : పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న టాలీవుడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్. తాజాగా ఈ దర్శకుడు ‘కీడా కోలా’ అనే చిత్రాన్ని ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నాడు. ఈ సినిమా తరుణ్ మూడో చిత్రంగా వస్తుంది. ఈ నగరానికి ఏమైంది సినిమా తరువాత తరుణ్ భాస్కర్ మరో సినిమా డైరెక్ట్ చేసేందుకు ఐదేళ్లు గ్యాప్ రావడానికి కారణం విక్టరీ వెంకటేష్ కారణం అని నెట్టింట ఎప్పటినుంచో వినిపిస్తున్న వార్త. ఇక ఈ విషయం పై తరుణ్ స్పందించాడు.
వెంకటేష్ తో కలిసి తరుణ్ భాస్కర్ ఒక సినిమా చేయాల్సి ఉంది. అయితే అది ఇప్పటివరకు పట్టాలు ఎక్కలేదు. ఇప్పుడు కొత్తవారితో ‘కీడా కోలా’ సినిమా తెరకెక్కించడంతో.. వెంకటేష్ సినిమా ఏమైందని సందేహం మొదలైంది. ఇక దీని పై తరుణ్ మాట్లాడుతూ.. “వెంకటేష్ తో ఒక ఇంటరెస్టింగ్ స్టోరీ అనుకున్నాను. అయితే దాని ఎండింగ్ రావడం లేదు. ఇప్పటికి ఆ కథ మీద పని చేస్తూనే ఉన్నాను. పెద్ద హీరోతో వచ్చిన అవకాశం కదా అని చెప్పి.. తొందర తొందరగా ఏదో ఒక సినిమా చేస్తే ప్లాప్ అవుతుంది. ఆ తరువాత మీరే అంటారు తరుణ్ కి పెద్ద హీరోలను హ్యాండిల్ చేయడం రాదని” అంటూ వ్యాఖ్యానించాడు.
ఆ ప్రాజెక్ట్ ని పక్కాగా పూర్తి చేసి, తప్పకుండా ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తానంటూ తరుణ్ తెలియజేశాడు. వెంకటేష్ లోని కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి వెంకటేష్ తరుణ్ భాస్కర్ హ్యూమర్ తోడైతే.. థియేటర్స్ లో ఆడియన్స్ కి నవ్వుల పండగే అని చెప్పాలి. విక్టరీ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ మూవీ ఎప్పుడు పట్టాలు ఎక్కుంతుందో చూడాలి.