Tharun Bhascker crazy promotions for Keedaa Cola movie
Tharun Bhascker : పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ తో అలరించిన దర్శకుడు తరుణ్ భాస్కర్.. చాలా గ్యాప్ తీసుకోని తన మూడో సినిమాగా ‘కీడా కోలా’(Keedaa Cola) చిత్రాన్ని తెరకెక్కించాడు. మొదటి సినిమాని ఫ్యామిలీ కథాంశంతో, సెకండ్ సినిమాని స్టూడెంట్స్ స్క్రీన్ ప్లేతో రాసుకున్న తరుణ్ భాస్కర్.. మూడో సినిమాని క్రైం కామెడీ థ్రిల్లర్ గా ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, ’30 వెడ్స్ 21′ సిరీస్ ఫేమ్ చైతన్య రావు, రవీంద్ర విజయ్, విష్ణు, రాగ్ మయూర్ తో పాటు తరుణ్ భాస్కర్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.
ఇక సినిమాల్లో తనదైన మార్క్ కామెడీతో నవ్వించే తరుణ్ భాస్కర్.. ప్రమోషన్స్ ని కూడా అదే విధంగా చేస్తూ వస్తున్నాడు. “నన్ను కాదు రోడ్డు చూసి నడుపు” అంటూ బ్రహ్మానందంతో మీమ్ పోస్టర్స్ డిజైన్ చేయించి వాటిని రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా వైరల్ చేసేశాడు. ఇప్పుడు తానే బ్రహ్మానందంగా మారిపోయి మీమ్ వీడియోలు కూడా చేసేస్తున్నాడు. బ్రహ్మి పలు సూపర్ హిట్ మీమ్ డైలాగ్స్ ని స్పూఫ్ వీడియో చేసి రిలీజ్ చేశాడు. ఆ వీడియో చూసిన నెటిజెన్స్.. తరుణ్ అన్న సినిమా రిలీజ్ కి ముందే చాలా మీమ్ కంటెంట్ ఇచ్చేస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also read : Oscar : ‘ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్’ కొత్త గౌరవం కాదు.. మొన్న ఎన్టీఆర్‌కి అయినా.. నేడు చరణ్‌కి అయినా..
కాగా ఈ మూవీ నవంబర్ 3న థియేటర్ లో సందడి చేయడానికి సిద్దమవుతుంది. ఈ సినిమాలో బ్రహ్మానందం పూర్తిగా వీల్ చైర్‌కే పరిమితం కాబోతున్నాడు. బ్రహ్మానందం పోషించిన ఈ పాత్రని తన తాతయ్య నుంచి స్ఫూర్తి పొంది తరుణ్ భాస్కర్ రాసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ఆయనది చాలా ఫన్ క్యారెక్టర్ అని, ఆ పాత్రకు బ్రహ్మనందం గారైతే బావుంటుదనిపించిందని, ఆయన కూడా అద్భుతంగా చేసారని, అందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని తరుణ్ వెల్లడించాడు.