Oscar : ‘ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్’ కొత్త గౌరవం కాదు.. మొన్న ఎన్టీఆర్‌కి అయినా.. నేడు చరణ్‌కి అయినా..
'ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్' కొత్త గౌరవం కాదు. ఆల్రెడీ ఆస్కార్ సభ్యత్వానికి ప్రతిపాదించిన వ్యక్తులను ఇప్పుడు అధికారికంగా ప్రకటిస్తున్నారు.

Ram Charan NTR got oscar membership along with six another Indians
Ram Charan – NTR : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్’లో సభ్యత్వం అందుకున్నట్లు అకాడమీ నేడు ప్రకటించింది. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ సభ్యత్వాన్ని అందుకున్నాడు. ఇక ఈ విషయాన్ని అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కాగా ఈ ఏడాది జూన్ నెలలో అకాడమీ తమ కొత్త సభ్యుల జాబితాని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ లిస్ట్ లో ఇండియా నుంచి 8 మంది ఉన్నారు. అందులో 6 గురు RRR సినిమా టీంకి చెందిన వాళ్ళు అయితే మిగిలిన ఇద్దరు.. కరణ్ జోహార్, షౌనక్ సేన్.
ఆ ఆరుగురు ఆర్ఆర్ఆర్ టీం మెంబర్స్ ఎవరంటే.. ఎన్టీఆర్, చరణ్, డిఒపి సెంథిల్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్. ఇలా అధికారికంగా అనౌన్స్ చేసిన తరువాత అకాడమీ.. వీరందరికి ఆహ్వానం పంపిస్తుంది. అలా ఆహ్వానాలు అందుకున్న వారంతా వాటిని స్వీకరిస్తే.. వారిని అధికారికంగా ఆయా బ్రాంచ్ మెంబెర్స్ గా అనౌన్స్ చేస్తుంది. ఈక్రమంలోనే ఎన్టీఆర్, చరణ్ కంటే ముందు.. మ్యూజిక్ డైరెక్టర్ క్లాస్ లో కీరవాణిని, సినిమాటోగ్రాఫర్ క్లాస్ లో సెంథిల్ కుమార్ ని, ప్రొడ్యూసర్స్ క్లాస్ లో కరణ్ జోహార్ ని, డాక్యుమెంటరీ క్లాస్ లో షౌనక్ సేన్ ని అనౌన్స్ చేసింది.
వీరి తరువాత గత నెలలో ఎన్టీఆర్ ని, ఇప్పుడు రామ్ చరణ్ ని యాక్టర్స్ క్లాస్ లో అనౌన్స్ చేసింది. ఇలా సభ్యత్వం అందుకున్న వారంతా.. ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్స్ లో నిలిచిన పోటీదారులకు ఓటు వేసే హక్కుని పొందుతారు. ఆల్రెడీ అందుకున్న ఘనతనే ఇప్పుడు మన హీరోలు స్వీకరించారు. అంతే తప్ప ఇది కొత్త గౌరవం కాదు. కాగా ఈ ఏడాది భారత్ నుంచి ఆస్కార్ కి మలయాళ హిట్ మూవీ ‘2018’ నామినేషన్స్ కోసం వెళ్ళింది. మరి ఆ మూవీ షార్ట్ లిస్ట్ లో స్థానం దక్కించుకుంటుందో లేదా చూడాలి.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram