Keeda Cola : ప్రమోషన్స్‌తోనే కామెడీ పుట్టిస్తున్న తరుణ్ భాస్కర్.. కీడా కోలా మూవీ పోస్టర్స్ చూశారా..?

కీడా కోలా ప్రమోషన్స్‌తోనే కామెడీ పుట్టిస్తున్న తరుణ్ భాస్కర్. మీమ్ లాంగ్వేజ్ స్టైల్ లో థియేట్రికల్ రిలీజ్ పోస్టర్స్..

Keeda Cola : ప్రమోషన్స్‌తోనే కామెడీ పుట్టిస్తున్న తరుణ్ భాస్కర్.. కీడా కోలా మూవీ పోస్టర్స్ చూశారా..?

Tharun Bhascker Keeda Cola promotions in meme language style

Updated On : October 25, 2023 / 5:11 PM IST

Keeda Cola : యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ తెరకెక్కించే డైరెక్టర్ తరుణ్ భాస్కర్ నుంచి దాదాపు ఐదేళ్ల విరామం తరువాత వస్తున్న సినిమా ‘కీడా కోలా’. క్రైం కామెడీ థ్రిల్లర్ గా ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ సినిమాలో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, ’30 వెడ్స్ 21′ సిరీస్ ఫేమ్ చైతన్య రావు, రవీంద్ర విజయ్, విష్ణు, రాగ్ మయూర్.. పలువురు ముఖ్య పాత్రల్లో పోషిస్తున్నారు. ఇక తరుణ్ భాస్కర్ ఈ సినిమాలో దర్శకత్వం భాద్యతతో పాటు యాక్టింగ్ బాధ్యత కూడా తీసుకున్నాడు.

ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ ఆడియన్స్ లో సినిమాపై మంచి బజ్ ని క్రియేట్ చేశాయి. నవంబర్ 3న థియేటర్ లో సందడి చేయడానికి సిద్దమవుతుంది. ఇక సినిమాల్లో నేచురల్ కామెడీతో ఎంటర్టైన్ చేసే తరుణ్ భాస్కర్.. ప్రమోషన్స్ ని కూడా అదే విధంగా చేస్తూ వస్తున్నాడు. ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చే ఇంటర్వ్యూల్లో తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను నవ్వించేస్తూ సినిమా పై మరింత ఆసక్తిని పెంచేస్తున్నాడు. ఇప్పుడు తాజాగా ఒక క్రేజీ పోస్టర్స్ ని రిలీజ్ చేసి రెండు స్టేట్స్ లో వైరల్ చేసేస్తున్నాడు.

Also read : Bigg Boss 7 : మునుగుతాయా..? తేలుతాయా..? బుర్ర‌కు ప‌దును పెట్టాల్సిందే..?

థియేట్రికల్ రిలీజ్ పోస్టర్స్ ని గోడలు పై, ఆటోల పై, బస్సుల పై అతికించి ప్రమోట్ చేయడం ఎప్పటినుంచో ఉన్న పద్దతే. ఈ పోస్టర్స్ ని హీరో, హీరోయిన్స్ తో అదిరిపోయేలా డిజైన్ చేస్తారు. అయితే ఈ పోస్టర్ ని తరుణ్ భాస్కర్ మీమ్ పోస్టర్ లా డిజైన్ చేశాడు. బ్రహ్మానందం ఫోటో వేసి.. “నన్ను కాదు రోడ్డు చూసి నడుపు” అంటూ సేఫ్టీ చెబుతూనే ప్రమోషన్ చేసేస్తున్నాడు. తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు, ఈనగరానికి ఏమైంది సినిమాలతో మీమర్స్ ఎన్నో మీమ్స్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఈ సినిమాతో మీమర్స్ కి ఇంకెంత స్టఫ్ ఇవ్వబోతున్నాడో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by ???? ?????? ?????? ? (@mana_telugu_trolls)