96th Oscars : ఆస్కార్ 2024 డేట్స్ ఇవే.. ఈసారి ఇండియా నుంచి వెళ్తాయా??

తాజాగా 96వ ఆస్కార్ వేడుకలకు సంబంధించిన డేట్స్ రిలీజ్ చేశారు. 2023 సంవత్సరంలో రిలీజ్ కానున్న సినిమాల కోసం ది అకాడమీ సంస్థ 2024లో ఇచ్చే అవార్డులకు డేట్స్ ని ప్రకటించింది.

96th Oscars :  ప్రపంచ సినిమాలో అత్యున్నత అవార్డ్స్ ఆస్కార్ అవార్డ్స్. ఆస్కార్ అవార్డు గెలవాలని, కనీసం నామినేషన్స్ లో అయినా ఉండాలని ప్రపంచంలోని అన్ని దేశాల సినీ పరిశ్రమలు ఎదురుచూస్తాయి. ఇటీవల జరిగిన 95వ ఆస్కార్ వేడుకలకు ఎప్పుడూ లేనంత హైప్ వచ్చింది. అందుకు కారణం RRR సినిమా. నాటు నాటు సాంగ్ నామినేషన్స్ తో ఆస్కార్ బరిలో RRR నిలవడంతో ఎన్నడూ లేనంత హైప్ ఆస్కార్ అవార్డ్స్ కి వచ్చింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఇండియా నుంచి నాటు నాటు ఆస్కార్ గెలుచుకొని సరికొత్త చరిత్ర సృష్టించింది.

నాటు నాటు సాంగ్ తో పాటు ది ఎలిఫాంట్ విష్పరర్స్ సినిమా కూడా ఆస్కార్ గెలవడంతో ఇండియా అంతా ఆస్కార్ బాగా వైరల్ అయింది. తాజాగా 96వ ఆస్కార్ వేడుకలకు సంబంధించిన డేట్స్ రిలీజ్ చేశారు. 2023 సంవత్సరంలో రిలీజ్ కానున్న సినిమాల కోసం ది అకాడమీ సంస్థ 2024లో ఇచ్చే అవార్డులకు డేట్స్ ని ప్రకటించింది.

ఆస్కార్ జనరల్ ఎంట్రీ కేటగిరి సబ్మిషన్ చివరి తేదీ.. బుధవారం, 15 నవంబర్ 2023
ఆస్కార్ షార్ట్ లిస్ట్ అనౌన్సమెంట్.. గురువారం, 21 డిసెంబర్ 2023
ఆస్కార్ నామినేషన్స్ లిస్ట్ అనౌన్సమెంట్.. మంగళవారం, 23 జనవరి 2024
ఆస్కార్ నామినీస్ లంచ్ కార్యక్రమం.. సోమవారం, 12 ఫిబ్రవరి 2024
96 ఆస్కార్ అవార్డుల వేడుక.. ఆదివారం 10 మార్చ్ 2024

Sankalp Reddy : తెలుగు డైరెక్టర్ బాలీవుడ్ సినిమా.. ట్రైలర్ చూశారా??

గత సంవత్సరం ఆస్కార్ జనరల్ కేటగిరిలో ఇండియా నుంచి పలు సినిమాలు వెళ్లాయి. ఇక నామినేషన్స్ లో మూడు విభాగాల్లో మూడు సినిమాలు నిలిచాయి. మరి ఈ సారి ఇండియా నుంచి ఏ సినిమా ఆస్కార్ కు వెళ్తుందో చూడాలి. ఇటీవల నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ బలగం సినిమాను ఆస్కార్ కు పంపిస్తాం అని అన్నారు. మరి దిల్ రాజు నిజంగానే బలగం సినిమాని ఆస్కార్ ఎంట్రీకి పంపిస్తాడేమో చూడాలి.

 

 

ట్రెండింగ్ వార్తలు