Sankalp Reddy : తెలుగు డైరెక్టర్ బాలీవుడ్ సినిమా.. ట్రైలర్ చూశారా??

డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి తెలుగులో ఘాజీ, అంతరిక్షం 9000KMPH సినిమాలతో ప్రేక్షకులను థ్రిల్ చేసి మెప్పించాడు. మొదటి సినిమా ఘాజీతోనే నేషనల్ అవార్డు అందుకున్నాడు.

Sankalp Reddy : తెలుగు డైరెక్టర్ బాలీవుడ్ సినిమా.. ట్రైలర్ చూశారా??

Sankalp Reddy Bollywood film IB71 Movie Trailer Released

Updated On : April 25, 2023 / 7:27 AM IST

Sankalp Reddy :  ఇటీవల కాలంలో మన తెలుగు సినిమాలు పాన్ ఇండియా వైడ్ భారీ విజయాలు సాధిస్తున్నాయి. మన తెలుగు సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ అవుతున్నాయి. ఇక మన తెలుగు డైరెక్టర్స్ ఇక్కడ సక్సెస్ కొట్టి బాలీవుడ్ కి వెళ్లి అక్కడ కూడా సక్సెస్ లు కొడుతున్నారు. ఇప్పటికే అనేకమంది తెలుగు డైరెక్టర్స్ బాలీవుడ్ లో సినిమాలు తీసి సక్సెస్ అయ్యారు. మరింతమంది తెలుగు డైరెక్టర్స్ బాలీవుడ్ సినిమాలు రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. తాజాగా మరో యువ డైరెక్టర్ బాలీవుడ్ సినిమాతో రాబోతున్నాడు.

డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి తెలుగులో ఘాజీ, అంతరిక్షం 9000KMPH సినిమాలతో ప్రేక్షకులను థ్రిల్ చేసి మెప్పించాడు. మొదటి సినిమా ఘాజీతోనే నేషనల్ అవార్డు అందుకున్నాడు. అనంతరం పిట్టకథలు వెబ్ సీరిస్ లో ఓ పార్ట్ ని డైరెక్ట్ చేశాడు. ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమా చేస్తున్నాడు సంకల్ప్. IB 71 టైటిల్ తో 1971లో పాకిస్థాన్ తో జరిగిన యుద్ధం కి సంబంధించి కొన్ని రియల్ సంఘటనలను ఆధారంగా తీసుకొని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. విద్యుత్ జమ్వాల్ హీరోగా, అనుపమ్ ఖేర్ ముఖ్యపాత్రలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

Sankalp Reddy.jpg

‘Swathi’ Balaram : సూపర్ హిట్ మ్యాగజైన్ ‘స్వాతి’ ఓనర్ వేమూరి బలరాం బయోపిక్.. త్వరలో..

తాజాగా IB 71 ట్రైలర్ రిలీజయింది. సస్పెన్స్, యుద్ధ, దేశభక్తి అంశాలతో ఈ ట్రైలర్ ప్రేక్షకులని మెప్పిస్తుంది. ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాని కూడా సంకల్ప్ అద్భుతంగా తెరకెక్కించాడని అర్ధమవుతుంది. ఇక ఈ సినిమా మే 12న రిలీజ్ కాబోతుంది. మరి IB 71 తెలుగులో కూడా రిలీజ్ చేస్తారా చూడాలి.