Manoj Bajpayee: ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ హీరో ఫాదర్ కన్నుమూత

ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ హీరో, బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయి తండ్రి ఆర్కే బాజ్‌పేయి కన్నుమూశారు.

Manoj Bajpayee: ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ హీరో ఫాదర్ కన్నుమూత

Manoj Bhaj

Updated On : October 3, 2021 / 3:36 PM IST

Manoj Bajpayee’s father RK Bajpayee: ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ హీరో, బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయి తండ్రి ఆర్కే బాజ్‌పేయి కన్నుమూశారు. చాలాకాలంగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆర్కే బాజ్‌పేయి వారం క్రితమే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. ఆర్కే బాజ్‌పేయి అంత్యక్రియలు ఈరోజు(3 అక్టోబర్ 2021) మధ్యాహ్నం ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్‌లో పూర్తయ్యాయి.

గత కొన్నిరోజులుగా మనోజ్ బాజ్‌పేయి తండ్రి ఆరోగ్యం చాలా విషమంగా ఉందని, ఈ కారణంగా కేరళలో షూటింగ్‌ వదులుకుని, తండ్రిని చూసుకునేందుకు ఢిల్లీకి మనోజ్ బాజ్‌పేయి చేరుకున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే, కోలుకున్నట్లుగా అందరూ భావించినా ఇంతలోనే ఆయన కన్నుమూశారు.

మనోజ్ బాజ్‌పేయి తండ్రి పేరు రాధాకాంత్ బాజ్‌పేయి, ఆయన వ్యవసాయం చేస్తూ ఉండేవారు. రైతు కొడుకుగా ఎన్నో పెద్ద విజయాలు, స్టార్‌డమ్ అందుకున్న మనోజ్ బాజ్‌పేయిని చూసి గర్వించేవారు ఆర్కే బాజ్‌పేయి. తన చివరి రోజులలో చాలా సంతోషకర జీవితాన్ని గడిపారు ఆర్కే బాజ్‌పేయి. మనోజ్ బాజ్‌పేయి తండ్రి బీహార్‌లో తన పూర్వీకుల ఇంట్లో ఉండేవారు.

స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ సెకండ్ సీజన్‌లో చివరిసారిగా మనోజ్ బాజ్‌పేయి కనిపించారు.