Brother from Another Mother.. నందమూరి సింహాన్ని పవన్ కలిసిన రోజు..

  • Published By: sekhar ,Published On : September 15, 2020 / 12:58 PM IST
Brother from Another Mother.. నందమూరి సింహాన్ని పవన్ కలిసిన రోజు..

Updated On : September 15, 2020 / 1:58 PM IST

Nagababu shared PK, NBK’s Rare pic: మెగా బ్రదర్ నాగబాబు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయ్యారు. సొంతగా ఓ యూట్యూబ్ ఛానెల్‌ ప్రారంభించి వివిధ అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అలాగే ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కూడా తరచుగా అప్‌డేట్స్ ఇస్తున్నారు.


తాజాగా నాగబాబు చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నందమూరి నటసింహం బాలకృష్ణ, తన తమ్ముడు పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ కలిసి ఉన్న పాత ఫొటోను నాగబాబు అభిమానులతో పంచుకున్నారు.
https://10tv.in/sp-balasubrahmanyam-health-update-from-his-son-sp-charan-2/
BK-PK




‘ఇద్దరు సోదరులు కలిసిన రోజు.. మొదటి వ్యక్తి నా సోదరుడు. రెండో వ్యక్తి మరో సోదరుడు.. నందమూరి సింహాన్ని పవర్‌స్టార్ కలిసిన రోజు’ అంటూ నాగబాబు కామెంట్ చేశారు. పవన్ ‘సుస్వాగతం’ సినిమా ప్రారంభోత్సవానికి బాలయ్య అతిథిగా వెళ్లినప్పటి ఫొటో ఇది.. ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

https://www.instagram.com/p/CFFTiZFM6Ip/?utm_source=ig_web_copy_link