Allu Arjun : అల్లు అర్జున్‌ను చూసి భావోద్వేగానికి గురైన కుటుంబ స‌భ్యులు..

అల్లు అర్జున్ చంచ‌ల్ గూడ జైలు నుంచి శ‌నివారం ఉద‌యం విడుద‌ల అయ్యారు.

The family members are emotional seeing Allu Arju

అల్లు అర్జున్ చంచ‌ల్ గూడ జైలు నుంచి శ‌నివారం ఉద‌యం విడుద‌ల అయ్యారు. అక్క‌డి నుంచి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాల‌యానికి చేరుకున్నారు. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజుతో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ఆయ‌న్ను క‌లిసేందుకు అక్క‌డికి వ‌చ్చారు. కాసేపు న్యాయ‌వాదుల బృందంతో అల్లు అర్జున్ చ‌ర్య‌లు చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లుగా తెలుస్తోంది. ఆ త‌రువాత ఇంటికి వెళ్లారు.

 

మ‌రోవైపు బ‌న్నీ కోసం ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు. బ‌న్నీ ఇంటికి చేరుకోగా.. ఆయ‌న్ని చూడ‌గానే కుటుంబ స‌భ్యులు భావోద్వేగానికి గురైయ్యారు. కొడుకు అయాన్, కూతురు అర్హ‌ ప‌రిగెత్తుకుంటూ వ‌చ్చారు. కుమారుడు, కుమార్తెను ఎత్తుకొని అల్లు అర్జున్‌ భావోద్వేగానికి గురయ్యారు. ఆయనను పట్టుకుని సతీమణి స్నేహ కన్నీటిపర్యంతమయ్యారు.

Chinni Krishna : అల్లు అర్జున్‌కు మ‌ర‌క‌లు అంటించేందుకు కొంద‌రు ప్ర‌య‌త్నిస్తున్నారు