Chinni Krishna : అల్లు అర్జున్‌కు మ‌ర‌క‌లు అంటించేందుకు కొంద‌రు ప్ర‌య‌త్నిస్తున్నారు

అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక కుట్ర ఉంద‌ని ర‌చ‌యిత చిన్ని కృష్ణ ఆరోపించారు.

Chinni Krishna : అల్లు అర్జున్‌కు మ‌ర‌క‌లు అంటించేందుకు కొంద‌రు ప్ర‌య‌త్నిస్తున్నారు

Chinni Krishna sensational comments on Allu Arjun Arrest

Updated On : December 14, 2024 / 8:48 AM IST

అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక కుట్ర ఉంద‌ని ర‌చ‌యిత చిన్ని కృష్ణ ఆరోపించారు. బ‌న్నీ అరెస్ట్ అమానుషం అని అన్నారు. బ‌న్నీ బెడ్ రూమ్ వ‌ర‌కూ వ‌చ్చి అరెస్ట్ చేయ‌డానికి పోలీసుల‌కు ఎంత ధైర్యం, ఆయ‌న వెనుక పెద్ద కుటుంబం ఉంది. మెగా ఫ్యామిలీ అంటేనే మాన‌వ‌త్వానికి చిరుమానా అన్నారు. అల్లు అర్జున్‌కు మ‌ర‌క‌లు అంటించేందుకు కొంద‌రు ప్ర‌య‌త్నిస్తున్నారు అని ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

శ‌నివారం ఉద‌యం అల్లు అర్జున్ చంచ‌ల్ గూడ జైలు నుంచి విడుద‌ల అయ్యారు. ఈ ఉద‌యం హైకోర్టు మ‌ధ్యంత‌ర బెయిల్ కాపీని జైలు సూప‌రింటెండ్‌కు అంద‌జేయ‌డంతో ఆ వెంట‌నే విడుద‌ల ప్ర‌క్రియ ప్రారంభించారు పోలీసులు. రూ.50వేల పూచీక‌త్తుపై జైలు సూప‌రింటెండెంట్‌కు స‌మ‌ర్పించారు అల్లు అర్జున్ న్యాయ‌వాదులు.

Allu Arjun: చంచ‌ల్‌గూడ‌ జైలు నుంచి సినీ హీరో అల్లు అర్జున్ విడుదల

అప్ప‌టికే చంచ‌ల్ గూడ జైలుకు భారీ సంఖ్య‌లో అభిమానులు, సినీ ప్ర‌ముఖులు చేరుకోవ‌డంతో బ‌న్నీని వెనుక గేటు నుంచి బ‌య‌ట‌కు పంపించారు పోలీసులు. అనంత‌రం త‌న తండ్రి అల్లు అర‌వింద్ క‌లిసి అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ ఆఫీసుకు చేరుకున్నారు. మ‌రోవైపు బన్నీ నివాసం వ‌ద్ద భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు పోలీసులు.