Akhanda
Akhanda: బాలయ్య ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అఖండ గర్జన మొదలు కానుంది. ముందుగా ఈ ఆదివారం ట్రైలర్ తో వేట మొదలుకానుంది. ఈ మేరకు సినిమా యూనిట్ ప్రకటన ఇచ్చేసింది. ఆదివారం సాయంత్రం 7.09 నిమిషాలకి అఖండ ట్రైలర్ విడుదల చేయనున్నారు. ట్రైలర్ తో పాటే విడుదల తేదీ కూడా ప్రకటించే అవకాశం ఉండడంతో నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
Kiara Advani: మొగుడు పెళ్ళాల మధ్యలో వచ్చే నాటీ గర్ల్ ఫ్రెండ్!
బాలయ్య సినిమా ఎప్పుడెప్పుడా అని నందమూరి అభిమానులు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. మాస్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా హ్యాట్రిక్ సినిమా అఖండ షూటింగ్ పూర్తిచేసుకుంది. సరైన సమయం చూసి గర్జించేందుకు సిద్ధమైంది. అఖండ విడుదల తేదీలపై కూడా చాలాకాలంగా వాయిదాలు పడుతూనే వస్తుండగా ఇప్పుడు ఇలా మంచి టైం చూసి థియేటర్లలోకి రాబోతుంది.
NBK 107: బాలయ్యతో శృతి.. ఎవరి కోసం ఓకే చెప్పిందో?!
ఇప్పటికే ఈ సినిమా నుండి వదిలిన టీజర్లు, పోస్టర్లు అభిమానుల అంచనాలను భారీగా పెంచేయగా ట్రైలర్ విడుదలపై ప్రకటనతో వదిలిన పోస్టర్ కూడా దద్దరిల్లేలా ఉంది. బాలయ్య అంటేనే రౌద్రం పండించడంలో తిరుగులేని హీరో. సరిగ్గా మేకర్స్ అదే పోస్టర్ వదిలి సందడి మొదలు పెట్టారు. ఇక రేపు ట్రైలర్ ఎలా ఉండబోతుందన్నది ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్యకు జోడిగా ప్రగ్యాజైస్వాల్ నటిస్తున్న ఈ సినిమాలో పూర్ణ కూడా మరో హీరోయిన్ గా నటిస్తుంది.