The Nayanthara surrogacy controversy is over
Nayanthara: సౌత్ లేడీ మెగాస్టార్ నయనతార, తమిళ స్టార్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ఎన్నో ఏళ్ల నుంచి ప్రేమించుకుంటూ ఉన్నారు. ఈ ఏడాది జూన్ లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. కాగా పెళ్లయిన నాలుగు నెలలకే ఈ జంట కవలలకు తల్లిదండ్రులు అయ్యినట్లు ప్రకటించడంతో అందరూ షాక్ కి గురయ్యారు. అసలు గర్భమే దాల్చకుండా అమ్మానాన్నలు ఎలా అయ్యారంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు ఎదుర్కొన్నారు.
Nayanthara: నయనతార సరోగసి వివాదంలో సరికొత్త ట్విస్ట్..
వీరిద్దరూ సరోగసి ద్వారా పిల్లలకి జన్మనిచ్చారు అని తెలవడంతో వివాదం రేగింది. భారతదేశంలో అద్దె గర్భం ద్వారా పిల్లలకు తల్లిదండ్రులు అవ్వడం చట్టరీత్యా నేరం కావడంతో.. తమిళనాడు ప్రభుత్వం ఈ విషయంపై నయన్ దంపతులను వివరణ కోరింది. ఈ మేరకు ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే విచారణ జరిపిన కమిటీ, నేడు ప్రభుత్వానికి నివేదికను అందజేసింది.
ఈ నివేదికలో.. “నయనతార, విఘ్నేష్ శివన్ చట్టబద్ధంగానే సరోగసి ద్వారా పిల్లలు పొందినట్లు తెలిపింది. వీరిద్దరికీ 2016 లోనే పెళ్లయిందని, చట్టబద్ధంగా ఐదేళ్ల తర్వాత అంటే 2021లో వీరు ఐసిఎంఆర్ నిబందనలను అనుసరించే సరోగసీ అగ్రిమెంట్ పూర్తి చేశారు” అంటూ పేర్కొంది. దీంతో నైన్ దంపతులకు వివాదం నుంచి ఊరట లభించింది.