Kate Winslet
Titanic overcoat at auction : 1997 లో వచ్చిన ‘టైటానిక్’ సినిమాలో హాలీవుడ్ నటి కేట్ విన్స్‌లెట్ ధరించిన ఓవర్ కోటు వేలానికి వేశారు. దాని ధర వింటే షాకవుతారు.
US Coast Guard Investigates : టైటానిక్ జలాంతర్గామి పేలుడుకు కారణాలపై యూఎస్ కోస్ట్‌గార్డ్ పరిశోధన
‘టైటానిక్’ సినిమా ఓ విజువల్ వండర్ . ఇప్పటికీ అబ్బురపరుస్తూనే ఉంటుంది. ఇందులో షిప్ మునిగిపోతున్నప్పుడు కేట్ విన్స్‌లెట్ ఓవర్ కోట్ వేసుకుని ఉంటుంది. రోజ్ పాత్రలో జాక్‌గా నటించిన లియోనార్డో డికాప్రియోను విడిపించే సన్నివేశంలో ఈ కోటులో కనిపిస్తుంది. షూటింగ్ టైంలో దీనిపై పడ్డ నీటి మరకలు ఇప్పటికీ ఉన్నాయట. ఈ సినిమాకోసం పనిచేసిన డెబోరా లిన్ స్కాట్ బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఆస్కార్ అందుకున్నారు. ఈ ఓవర్ కోటును నలుపు రంగు ఎంబ్రాయిడరీతో పింక్ ఉన్నితో రూపొందించారట. విషయం ఏంటంటే.. ఈ కోటుని వేలంలో పెట్టారు. అక్షరాల ఈ కోటు $100,000 (రూ.8,28,5000) ధర పలుకుతోంది. ఇప్పటికే ఈ కోటు కోసం ఐదురుగు వ్యక్తులు $34,000 (రూ.2,820,553.3) ఆఫర్ చేశారట.
అయితే నిర్వాహకులు $100,000 కంటే ఎక్కువ ధర పలుకుతుందని నమ్మకంగా ఉన్నారట. ఇక ఈ కోటను కొనుక్కుని ఏం చేస్తారు? అనే అనుమానం రావచ్చు.. బహుశా కొన్నవారు తమ భార్యకు బహుమతిగా ఇచ్చి ఇది కేట్ విన్స్‌లెట్ ధరించిన కోటు అని చెప్పుకోవచ్చు అని జనం అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ కోటు వేలంలో ఎంత ధరకు అమ్ముడవుతుందో చూడాలి.